పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబుకవధ


(ఉత్తర రామచరిత)

తృతీ యాం క ము

.

-:0:-

చిదానందాశ్రమము

(అంగదుఁకు, శంబుకుడు ప్రవేశింతురు)

శం: యువరాజా ! నీవు వెర్రిబాగులవాఁడవుసుమా! శ్రీరామచంద్రుఁ
             డు నన్ను జంపుననియా నీ దుఃఖము! నామరణము వలన నార్యుల
             కుఁగలుగు లాభముకన్న ననార్యులకు గలుగు లాభము మెండుగ
             నుండునని నీవెఱుంగవా!

అం: మహాత్మా ! యిది యెట్లు ?

శం: నా మరణము ద్రావిడ సంఘము నందు నూతన జీవము కల్పింపదని
          యా నీనమ్మకము ? ఆత్మాభిమానము గల ప్రతి జాతికిని గ్రూరదం
          డనము స్వాతంత్ర్య రక్షణాశక్తిని బుట్టించును.

అం: ఇది యాత్మాభిమానము గల జూతి లక్షణమని మీరు 'సెలవిచ్చి
         తిరి. ఇది యనార్యులమయిన మనకు నన్వయించునాయని యురి
         యాడుచుంటిని,