పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శంబుకవధ


 గంబునకును గార్య కారణ బాంధవ్యంబు గుర్తింపజాలకున్నాడు..

వ; మనమిప్పుడు సేయుచున్న కర్మమునకు నుత్ర జన్మమునకును
           సంబంధ బాంధస్యము లెట్లు చెప్పెదవు. కొన్ని యెడల గార్య
           కారణ సంబంధమూహింపదగినది. అదియుంగాక వంశగురువు
          నగు నేను చెప్పుచున్నాఁడను. ఋషి ప్రోక్తములగు శాస్త్రము
          లను జూపించుచున్నాఁడను. ఇంకను సంశయమేల ! నాఁడపర
         బ్రహ్మయగు విశ్వామిత్ర వాక్యములయందు విశ్వాసముంచి తాట
          కిని వధింప లేదా?

హ:- (తనలో) క్రమక్రమముగా నెత్తి పొడుపులోనికి దిగుచున్నదే
        తాతగారిపని.

శ్రీ:- స్వామి! యది నరహంత.

వ: (ఆత్రముతో) ఇతఁడు బ్రాహ్మణహంత. స్మృతి ధిక్కారముచే
       బ్రాహ్మణవధఁ జేసినాడు. ఎవ్వరెక్కుడు పాపకర్ములో యోజించు
        కొనుము.

శ్రీ:- ఇది నిజముయినచో వెనుదీయను.

వ: నిజము కాకేమి ? లెమ్ము కీర్తి కాముఁడవుకమ్ము.

హ: (తనలో) నిరపరాధునిఁజంపి శ్రీ రామచంద్రుఁడు యశస్వికావలసి
       వచ్చేనుగా.

శ్రీ:- ఈ వాక్యములఁ బ్రతిఘటింపజాలను. మాయాజ్ఞను నేఱ
       వేర్చెద.

హ:- (తనలో) తఱచిట్టి కార్యములు నా నెత్తి నే పడుచుండును. శ్రీ
      రామచంద్రుఁడు నన్నీ పనికి మాత్రము నియోగింపకుండునుగాక,