పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాం క ము,

37


 
       యాత్మకు ధర్మముల విసర్జించి, ద్విజ హితములగు కర్మముల
       నాచరించిన యెడల దచ్ఛూద్రుడు పాపగ్ని దగ్ధడు కావలయును
       గాని ద్విజ శిశువు మరణించు టెట్లు తటస్థిఁచును ? ఇటులయినచో
       ద్విజేతరులు తపంబుఁ జేసిన యెడల ద్విజులు నామమాత్రావ శేషు
       లగుదురా ! అధర్మమా చరించుచున్న పశ్యతోహరుని మహా పాప
      ముచే నెచ్చటనో యున్న పరులు నశింతురా ? పాతకులను దమ
      పాపములు బాధింపవా! అట్లుండ నైన నాకేమియ దోచుటలేదు.

అం:-(తనలో) మాహనుమన్న యెంతవాఁడైనాఁడు? వేదాంతము
      వెలిగించు చున్న నాఁడు. దొంగకు నీతులా?

చై: ఆంజనేయా ! శ్రమపడి ప్రశ్న నడి గితివి కాని నీకు శాస్త్ర చర్చ
      చేయు నధికారము లేదెఱుంగ దువా! మాబోంట్లు ధర్మ సూక్ష్మమ
      ములను నీకు, జెప్పను దగదు, నీవు వినను దగదు.

అం:-(తనలో) మాహనుమయ్య తలతిక్క వదలి నట్లున్నది.

హ:-అయ్యా ! మాకెందులకుఁ జెప్పఁగూడదో యిప్పుడు తెలి
      సినది.

వ:- (రామును ద్దేశించి) వింటివా రాఘవ రామచద్రా యాశ్రమసాం
     కర్యంబునఁ గల్గు దుర్నయములు ! మనము విన్న దానికిని నేడు
     కన్న దానికిని సరిపోయినది. ఇది తప్పక శంబుకుని తపశ్చరణ
     ఫలితముగా నోపు. నిర్నిమిత్తంబుగ నిట్టివి గలుగవు.

అం:-(తనలో) ఇంక నేనిచ్చట నిలువఁజాలను. మానవుఁడెట్టి కార్య
       ములను జేయఁగలడో నేడు తెలిసినది. (నిష్క్రమించును.)

శ్రీ:- మునీంద్రా ! నామనంబింకను సంతృప్తి పడకున్నది. నిర్జనమైన
       యరణ్యసీమ తపంబు జేసికొనుచున్న శంబుకునకును నీబాలమర