పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

యువతీజనంబు తమ తమ పిల్లలజుట్టుసు బక్తి పురస్సరంబుగా నర్పించి సంతసించుట కాంచుచు నేయుంటిమి.వేలయేడ్లు గడిచినను నట్టివి తెలుగు దేశమున రూపు మాయ కుండుట కడుచిత్రము. ప్రాచీనాచారముల యందు హిందువుల కున్న మూఢవిశ్వా సమే యిందులకుఁ గారణము.

ఆర్యులు

దేశమిట్టి స్థితియం దుండఁగా నుత్తర కురుభూముల నుండి యార్యులు హిమాలయ దరీముఖ ద్వాములను దెరచి హిందూ దేశము పైబడి ద్రావిడులను దక్షిణాపథము సకుఁ డఱిమిరి. మొట్ట మొదట వీరతిసౌర వంతములగు సింధు గంగానకదీ ప్రాంత భూముల నాక్రమించుకొనిరి. ఇచ్చటనే యార్య ద్రావిడులకు భయంకర యుద్దములు సంభవించెను. కొన్ని యెడలఁ దుముల సమరములు, కొన్ని యెడల తులారణములు గల్గి కొన్ని వందలయేండ్లవరకు జయాపజయములు నిర్ణయింప వలను పడదయ్యెను. క్రమశ్రమముగా ద్రావిడులు వీఁగిరి. ఆర్యులు వీరలను దక్షిణ దిక్కునకు నెట్టివేసిరి. ఈ యుద్ధములనే పురాణామలు దేవవాసవ యుద్ధములుగా వర్ణించినవి. తుట్టతుదకు జైత్ర యాత్రా సముద్రమునకు వింధ్య పర్వత పంక్తి చెలియలికట్ట యైనది. జాతి వైషమ్యమప్పుడే, యంకురించినది. నాఁటనుండియు వింద్యపర్వత దక్షణభూమి పాపభూమి యనియు నుత్తరదేశము పుణ్యభూమి, దేవ భూమి, నార్యావర్త మనియు సంస్కృత కవుల గ్రంధముల యందు వాసి కెక్కెను. చిరకాలము వరకుకు "నా ర్యులు వింద్యాపర్వతపక్తి మత్త రించి దక్షిణా పథమునకు రాప్రయత్నింప రైరి. వీరి మాతృభాష, గీర్వాణము. అందుచేతనే యీ కాలమంచు దేవభూమి యందు వ్యవహరింపఁ బడుచున్న గీర్వాణమునకు దేప భాషయను నామము కల్గినది. విద్యపర్వత్తము నుత్తరించి ద్రావిడులకు సనాతనధర్మము బోదింప మొట్ట మొదట పచ్చినది యగస్త్యుడు. దీని నాధారముఁ జేసికొసియే పురాణములు సూర్యున కడ్డమయిన వింధ్య పర్వతమును నగస్త్యుఁడణగ దొక్కెనను గాధను గల్పించినవి.


ఆర్య శబ్దమునకుఁ గృషీవలుడని కొందరర్దము జెప్పు చున్నారు.ఈయర్థ మె ట్లున్నను హిందూ దేశముఁ జొచ్చునప్పటికి నార్య సంఘము త్రివర్గముగా విభజిం ప బడి ధర్మబద్ధమై యుండెను.బ్రహ్మ క్షత్రియ వైశ్యులను మూఁడు పర్గము లే నాఁడార్య సంఘము నందున్నవి. ద్రావిడులతో జరిగిన యుద్ధముల పిదప , విజితుల యిన ద్రావిడుల నందఱను గల గూరగంపఁజేసి శూద్రులను నామకరణముతో నాల్గవ