పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శంబుకవధ


(శ్రీరాముఁడు, హనుమంతుఁడు, అంగదుఁడు ప్రవేశింతురు)


శ్రీ:_ అంగదా ! చిరకాలమునకు మమ్ము దర్శింపవచ్చితివి. వాసర
           సౌర్వభౌముఁడు సుఖముగ రాజ్య మేలు చుండెనా! మమ్మేమయిన,
           దలపోయు చుండునా ?

అం:--- దేవా ! హసాదు, మీయాజ్ఞా బద్ధుఁడై కదా కిష్కింధాపుర
           మున వానర సార్వభౌముఁడు రాజ్యముఁ జేయుచుండుట ! మిమ్ముఁ
           దలంపని నిమిష మొక్కటి యయిననుండునా? అందు సుగ్రీవ సార్వ
           భౌముడు మిమ్ము దలంప కుండునా ! ఆమరణాంతము కృతజ్ఞుడనై
           యుండ దగిన సాహాయ్యము చేసితి రని చెప్పు చుండును.

హ:- (తనలో) ఏమి యువరాజు మాటలు వ్యంగ్యప్రధానముగా
          నున్నవి. ఏలాగో వీని చర్యల నుమానాస్పదములుగాఁ గన్పట్టు
          చున్నవి.

శ్రీ:- కుమారా ! అంగదా !! మేము చేసినది కడు నల్పకృత్యము
        సుమీ. మాపినతండ్రి మిగుల ప్రబుద్ధుఁడగుటచే మాయందుఁ
        గడుంగడుఁ గృతజ్ఞుఁడై యున్నాడు.

అం:- (తనలో) నిజముగ నల్పకృత్యమే (ప్రకాశముగా) దానికే
        రేయింబవళ్లాంతరంగికులతోఁ జెప్పికొని యువ్విళ్లూరుచుండును.
        దేవరవారికి నాకస్మికముగా వాటిల్లిన యాఫత్తునకుఁ గుందికుంది
        వెంటనే నన్ను మీకడకంపెను.

శ్రీ:- అంగదా ! తీర రానియిక్కటే కాని, .

        సీ॥ కాక పక్షంబులు ,గల్గని పసినాఁడె
                   దేశముల్ ఋషితోడ • దిమ్మదిరిగి
        కనులలో బెట్టుక' . యనుకంప సాకిన
                  ఫితృమరణంబుచే • వెగటు చెంది