పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శంబుకవద్గ

చై: ద్రావిడులయందు నూతనశక్తి యొండుద్భవిల్లినది. ఆర్యులతో
             సమానస్వత్వమును గోరుచున్నారు. దీని కంతకును మూలకంద
             మా శంబుకుఁడు. వానిని గడ తేర్చినఁగాని యీయాందోళనము
             సమసిపోవదు.

సో.యా:- అయి తే నీవు శంబుకు నెఱుంగుదువా ! వాడెంతపనిఁ జేయు
             చున్నాడు. తొల్లి తపోభంగమై ద్రావిడుఁడై పుట్టెను గాఁబోలు.

చై:- ఆఁయెఱుంగుదును, పరమసాధువు, విజ్ఞాని, పరాప కాగముఁ
            దల పెట్టడు.

సో.యా: నీమాటలు చిత్రముగా నున్నవి.అట్లయినచో నిది యంతయు
           నేమిటి ? ఎందులకు వచ్చినపని ?

చై:- ప్రజలందఱు సమానముగాఁ బరిపాలింపఁబడ వలయు
           ననియు, సమానమగు హక్కులుండ వలయుననియు నాతని
           వాదము. అందులో మత విషయమున నీషణ్మాత్ర మైన భేద
           ముండఁ గూడదని యాతని యభిప్రాయము. అందుచే నతఁ
           డిట్లు చేయు చున్నాడు.

సో.యూ:- అట్లయి తే ఋషి ప్రోక్తములగు గ్రంథములన్నియు సున్న
              చుట్టవలసిన దేనా ?

చై- స్వత్వసామాన్యమునకుఁ బ్రతిబంధకములగు నీతులన్నియు గర్హ్య
             ములనియే యాతని యభిప్రాయము.

సో.యా: ఓహో ! కొంపకు నిప్పు ముట్టించు చున్నాఁడే ! అతడిప్పు
            డెక్కడనున్నాడు?

చై:- మన పట్టణంబునకుఁ బరిసరంబున నే సరయూ నదీ తీరమునఁ జిదా
           నందాశ్రమమని పేరు పెట్టుకొని యొక యాశ్రమము నిర్మించుకొని
           తపస్సు జేసికొనుచు, నప్పుడప్పుడు శిష్యులకుఁ దత్వోపదేశము
           గావించు చుండును.