పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయం క ము

19


చై:- ప్రాతఃస్నా నము జేసి, సంధ్యావందనముఁ జేసి కొనుటకు వేకవ
        జాముననే లేచి నేఁడు కకుత్సఘట్టముసకుఁ బోయితిని. నాకన్న
        ముందుగనే యొకఁ డొడ లెల్ల బూడిద పూసికొని వివిధకుసుమ
        పత్రసమానృతుఁడై విఘ్నేశ్వర పూజఁ జేయుచుండె. కపరకప్పర
       చీకటులు నలు గెలఁకుల నలము కాని యుండుటచేఁ జూడక యా
       వినాయక విగ్రహము పైఁ బడితిని. అంత నాతఁడు మండి పడుచు
       నన్ను దూలనాడ నారంభించెను.

సోయా:-చైనులుగానూ ! దేవతా విగ్రహము పైఁబడుట దోషము


చై: దోషమేకాని, యాతఁ డెవ్వఁడనుకొన్నారు ? అతఁడు గురుదా
             సుని తమ్ముఁడఁట.

సో.యా:-అవురా ! ఏమని తూలనాడినాఁడు !

చై:- దేవ పూజా విఘ్నముగావించుట మొఱకుల లక్షణమని యేమే
             మియో గొణిగినాఁడు.

సో.యా:- దారితప్పిపోయిన కొలంది పైపైకి వచ్చుచున్నారు. దయా
             దాక్షిణ్యములుమాని వీరలను దల్లి వేరులతో, బెకలించి పాఆ వేయ
             వలయును. రామభద్రున కీసంగతి తెలిసినదా ! ఆర్షేయము
             లగు శాస్త్రములను ధిక్కరించి గురుధనాపహరణముసకుఁ బూని
             రిగా తుచ్చులు. ఇప్పుడే వీనిని గొఱుత వేయించ వలయును.
             పెందలకడనే 'మేలుకొనుట యుక్తము.

చై:-: పుండొకచోట నున్న మందొక చోట వేసిన ఫలమేమి? వీనినోళని
           దుదముట్టించిన లాభ లేమి ?

సో.యా:-నీవు చెప్పుచున్న మాటలు నాకర్దమగుటలేదు.