పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

శింబుక వధ.


              
                    నుండి వచ్చినదండి : ఈసాకేతపురమంతయు నాగుబ్బుగా జెప్సికొను
                    చున్న సంగతులు మీచెవినిఁబడ లేదా ? ఎంత శాంతము. ముసలి
                    తనము హెచ్చిన కొలంది శాంతము కూడ హెచ్చుచున్నది.
                    ఇదోసృష్టి వైచిత్రము.

సో. యా:-చైనులుగారూ ! మీదంతయు నొకగోల, గ్రుడ్డికన్ను
                   మూసిన నేమి తెఱచిన నేమియన్నట్లు, చెవిదగ్గర శంఖమూదినను
                   వినఁబడని నాకు నూరిలోని సంగతులు తెలియఁగలవా వెర్రిగాని!

వై:- అట్లయిన వారు మంచియవస్థలోనే యున్నారు.

సో. యా:- (విసుగుతో), మంచో ! చెడుగో ! కాని మీరు
                   పని చెప్పగాదూ !

చై:- చెప్పుటకుమాత్రము నో రాడవద్దూ : శాస్త్ర కారుల మాటలప్పుడే
                నిజములగు చున్నవి చూచారా ? శాస్త్ర కారులు తెలివితక్కువ
                వారా ! త్రికాలజ్ఞులు కాదూ !

సో. యా:- శాస్త్రముల యుబు సెత్తుచున్నావు మన కిప్పుడేమి మూడినది.
               మీరు వచ్చినది?

చై:- ఏమిమూడిన దా! మొన్నటి సంగతి విన్నారుకదా !

సో. యా:-గురు దాసు 'పేలినమాటలా ? ఆఁ ఏన కేమి ? తగిన ప్రాయ
             శ్చిత్తమే యయినది కాదా ! కొఱుత వేయించినారు కదా.
             కండ్లారఁజూచినావా ? దుర్మార్తుల శిక్షించుపట్ల శ్రీరామచంద్ర
             భగవానునకు దయ యను మాట ' యేకోశమందయిన నుండదు
             సుమా!

చై:-- ఈ యప్రాశ్యపుముండ కొడుకులు శిక్షించిన కోలంది 'మొండివా
            రగుచున్నారు, వీరు పెచ్చు పెరుగుచున్నట్లున్నది.

సో. యా:క్రొత్తగా నిప్పుడేమి వాటిల్లినది ?