పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

శంబుక వధ.


         సమస్కరించి, యర్ఘ్య పాద్యాదులొసంగి, యాత్మశాంతిని జేసి
         కొందురు.

        ( తెరలో) ఆత్మశాంతికి నతిథి పూజయే యుత్తమోత్తమ మని
        మీరు నిరంతరము సెలవిచ్చుచుందురు కదా. ఇదిగో! యతిథిని
        గొని వచ్చితి.

శం: కుమారా ! నీవేనా ? యింత యాలస్య మేలచేసితివి ? ఎవ్వ
         రా యతిథి ? నీవు పోయి పూజాద్రవ్యములను గొనిరమ్ము. ఈశ్వ
         రో ద్దేశము చేతను, రాజోద్దేశముచేతను సేవయేకదా మనకు గర్త
         వ్యము.

        (శిష్యుడును, అంగదుఁడును బ్రవేశింతురు.)

శి: ఇడుగో! యతిథి. గుర్వాజ్ఞును నెఱు వేర్చుటకుఁ బోయెదను.
       (నిష్కమించును)
.
అం:-కిష్కింధాపురయువరాజు, అంగదుడు నమస్కరించుచున్నాడు.

శం: వత్సా! ! చిరకాలము మనుము. నిన్ను జూచుటచే నాకానం
      దము గల్గుచున్నది. దారితప్పి వచ్చినట్లున్నది. 'సుగ్రీవమహారాజు
      సుఖముగ రాజ్యమేలుచుండెనా ! కిష్కింధాపురపౌరు లెల్ల రానం
      దముతో వర్ధిల్లుచుండిరా !

అం:మీ యనుగ్రహమువలన నెల్లరు సుఖముగఁ గాలయాపనము
      జేయుచున్నారు. రామచంద్ర దర్శనార్థమై యఱుగుచు మార్గ
      మధ్యమున భవచ్ఛిష్యునిఁగాంచి, మాయాశ్రమము పరిసరం
      బున నుండు బెఱింగి పతితులను బోవనులఁ జేయు మిమ్ము సంద
      ర్శించు మనంబున వచ్చితి.

శం:కుమారా ! యటులయినచో నీ రేయి మాపర్ణకుటీరమునఁ గడపి