పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

శంబుకవధ

అం: అనార్యులన గా !

శం. ...ఆర్య జైత్రయాత్రకు బూర్వపు దేశవాస్తవ్యులు.

అం-- (తనలో) పాక్షికమయిన పరిపాలన మెప్పుడు సర్వజన సౌఖ్య
        సంధాయకము కాదు. వీనిని గొంతవజుకుఁ దఱచి చూచెద.
        (ప్రకాశముగా) అయ్యా ! యేల యింత యసంతృప్తితో మాటా
       డుచున్న వారు : భగవదవతారమని యెంచఁబడుచున్న రామ
       రాజ్యములోనె కొఱత - వాటిల్లుచున్నదా! ప్రాణి సేవ యుత్త
       మోత్తమమగు కార్యమేకదా ?

శం. శి–అయ్యా! యెవ్వరి కెవ్వరిపరిపాలనంబు సర్వసౌఖ్యసంధా
     యకముగ నుండునో, వారికి నేతత్పరిపాలకుండు ' భగవదవతార
     మగునుగాని యితరుల కెట్లగును. కాని ప్రొద్దుగ్రంకుచున్నది.
     మాగురువు గారు నాకై యెదురుచూచు చుందురు. నేను పోవల
     యును. మీ రెవ్వరు ? ఎక్కడకుఁ బోవుచున్నారు ? మా యాతి
     థ్యము గ్రహింప నిచ్చగల దేని నాతో దయచేయుఁడు.

అం అయ్యా - మీ గురు వెవ్వరు ?

శం. : శంబుక సంయమీంద్రుఁడు.

అం: శంబుక సంయమీంద్రుఁడా ?

శం. :-ఏమి యట్లు వెఱగుపడుచున్న వారు? మాగురువుగారినే
        యెఱుంగరా ! సాకేతపురప్రాంతములకు నెప్పుడయిన వచ్చి
        యెఱుఁగరా?

అం రామపట్టాభి పేకమహోత్సవమునకు వచ్చితినిగాని........

శం.:- అయ్యో !రామపట్టాభి షేకమున కనుచున్నారు. రామచం
        ద్రుని శిష్యులా ? అటులయినఁ బొరపడితిని. ఇట్టి ప్రసంగముఁ
        జేయఁ గిట్టదు.