పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఇంగ్లీషు" వారున్ను, "ఇంగ్లీషు" భాషాగ్రంథములు చదివినవారికి జర్మనులును రాక్షసులుగాను తోపకమానదు. విపక్షులనుగూర్చి వ్రాసిన సంస్కృత గ్రంథములు చాలవఱకట్టి భావములనే వెలిబుచ్చెనని మేమభిప్రాయపడుచుంటిమి. ద్వితీయపక్ష రచితగ్రంథము లేమయినవన్న యెడల దౌర్భాగ్యవశమ్మున మనకంటంబడగుండుట శోచనీయము. ఇందుచేతనే ప్రాచీన హిందూదేశమునుగూర్చి యిదమిద్ధమని రూఢిపఱచుటకు మివుల సాహసము కావలయును. యాదిమ వాసులను మేము ద్రావిడశబ్దవాచ్యులునుగా జేసినందులకుఁ జదువరులు మన్నింతురుగాక.

......తారతమ్యమునుబట్టి ద్రావిడులను రెండు భాగములుగా విభజింపవచ్చును; [1](1) మాంసభక్షకులు (తారకాదులు) శాకభక్షకులు (వాలిసుగ్రీవాదులు) మాంసభక్షకులు రాక్షసులనియు శాకభక్షకులు వానరులనియు వ్యవహరింపఁబడిరి వానరులకుఁ గిష్కింధాపట్టణమాయువుపట్టు, రాక్షసులకు లంకాపట్టణము గుండెకాయ. రాక్షకులు వివిధాపక్వమాంసభక్షకులని గీర్వాణగ్రంథములు వ్రాకొనుచున్నవి. సింహళద్వీపచరిత్ర పరిశోధనబుద్ధితోఁ జదివిన యెడల నచ్చటి యాదిమవాసులయిన యక్షులపక్వమాంస భక్షకులుగానున్నట్టు పొడకట్టును. మలయాల ప్రాంతముననున్న నొకజాతి స్త్రీపురుషులందఱు తమపండ్లను నాకురాయిచేఁ రలుగాఁగో జేసికొనునలవాటు కలదనియు, నిది యొక కాలముక్రిందటనున్న నరమాంసభక్షక చిహ్నమనియు నొకరు వాదించుచున్నారు. ఇది నిజమయినను గావచ్చును. ఇంతయేల? ఆర్యులయందు నరమేధమను నొకవిధమగు యజ్ఙమాచరణలోనున్నది. నేఁటికిని పసిఫిక్ మహాసముద్రమునందున్న దీవులయందు నరమాంస భక్షకులున్నారు. సమస్త దేశములయందును నెప్పుడో యొకయప్పుడు నరమాంసభక్షకులుండిరి. ఈరాక్షసులయందు నెక్కువ పరిజ్ఞానము కలవారు వీరశైవులుగా నుండిరి. ఇందుచేతనే పురాణములన్నియు సామాన్యముగా రాక్షసులను శైవభక్తులనుగా వర్ణించినవి. జాతివిరుద్ధముగా నెవ్వఁడో యొక్కఁడు విష్ణుభక్తుడుగా నుండెడివాఁడు ప్రహ్లాదునకిందుచేతనే యన్ని కడగండ్లు వాటిల్లినవి ఈ ద్రావిడు


అరణ్యపర్వము తృతీయాంకము భారతము.

  1. అంబరీషుడు రుచికుని కుమారుఁడయిన శునశ్శేపుని లక్షగోవులనిచ్చి యజ్ఞపశువుగాఁ గైకొనియె. బాలకాండము భాస్కర రామాయణము.