పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x


లన్నీయు బలాత్కార వివాహములుగనే యున్నవి. అందు చేతనే బలాత్కార వివాహ ములు రాక్షస వివాహములని పేర్కొనఁబడు చున్నవి. వేదాదుల యందు వీరు దస్యు లనంబడిరి. ఎదుటబడి ఆర్యులతో బోరి గెలువ జాలక రాత్రులార్యుల పల్లెల పై బడి గందరగోళముఁజేసి యార్యుల యువతీ జనంబును హరించుకొని పోవు చుండిరి వేదముల యందున్న దేవ ప్రార్ధనలలో జాలవఱకు ఆర్యులను దస్యులనుండి కాపాడు నిమిత్త మేర్పడినవి. వీరికి వైవాహికము లున్నను, వీరియందు స్వైర విహార ధీరలు చాల మంది కలరు.అజనక్త్రయను రాక్షుసికి వ్యభిచారమే యొక నోము గానుఁండెనట. జరభీ సంతానము నింద్యముగాఁ బరిగణింపఁ బడినది కాదు. ఈకాలమున పరాజితుల భార్యలతో గూడ వానివస్తువు నంతయు స్వాధీన పఱచు కొనట యాచారమె,ధర్మ విరుద్ధము కాదయ్యె, ఈ యాచారము వానరులయందుగూడ నున్నయది. ఇందువల్లనే వాలి భార్య తారను సుగ్రీవుఁడుంచు కొనుట తటస్థించినది.


రాక్షసులలో గాని, వానరులలోఁగాని యార్యులలో గాని షోడశవర్షా త్పూర్వము కన్యా వివాహములు దల పెట్టుట యెఱుంగము. వినను లేదు కనను లేదు. ఇట్టియధర్మ వివాహముల నాదేశించు మునిరూపశార్దూలురును లేరు. రామా యణ కాలమున నార్యులయందు దోషములుగాఁ బరిగణిం పబడుచున్న యాచార ములు వీరిచే . హేయములుగా నెంచ బడక యనుష్టింపఁ బడుచున్నవి. వీరు మాంస భక్షకులు, సురాపాన ప్రియులు. కాని సుర సేవ్యమాన మగుటచే సురయయ్యె నేమో యూహింపఁద గియున్నది. రాక్షసులకు మానవులకు నిరాటంకముగా నుద్వాహ ములు జరిగి యుండుట చేతను, నర మాంస భక్షకులని చెప్పఁజాలము. పైపెచ్చు రామాయణము రావణుని నరమాంస భక్షకునిగాఁ జెప్పి ముండ లేదు. ఆర్యులకుఁ బ్రత్య ర్ధులగుటం జేసి గీర్వాణకవులు వీరియెడ మాత్సర్య జనిత భావములను గుప్పియుందురు పహ్లాదుని వంటి భక్తుఁడు బలివంటి వదాస్యుడు వృశునింబోలు తత్వవేత్త హపిలు ణ్యాక్షునివంటి రణనీతి బక్తుడు, రావణునివంటి యంతర్వాణి యాగ్యలయందు మున మెందరున్నారో వేలు మడంచి లెక్కించినఁ తెలియనగు రాజ్య పాత్రచే .....సు హిమా గర్భస్థ పిండముల ఖండించిన క్రూరుఁడు, సోదరుఁడగు విశ్వరూపుని తలఁ దునిమిన వాల్మీకిణుఁడు, పూజ్యయగు ముని పత్నిని మోసగించి వ్యభిచరించిన నీచుఁడు, చేసిన చిత్భ్రమంయు మఱచి ప్రాణదాతతో డీకొనిన కృతమ్నుడు నయిన ఇంద్రుడు త్రైలోకుడు పొలకుండఁట' బలిహంతవ్యుఁడఁట!! ఇయ్యది సంస్కృత కవీంద్ర లేఖినీ మాహామనుటల ముకాదా?