పుట:2015.386215.kumaara-sanbhavamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iv)

ఇంగ్లీషు, హిందీ బాషలలోనికి అనువాదం చేయించి ప్రచురించింది

తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంపుటాలను తయారు చేయించే కార్యక్రమంలో 'విశ్వసాహితి'ని, 'హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఆంధ్రాస్' అనే పేరుతో ఆంగ్లంలో ఒక సంపుటాన్ని ప్రచురించింది

ప్రాచీన ప్రౌడాంధ్ర కావ్యాలకు వ్యాఖ్యానాలు లేకపోతే అర్థం చేసుకునే శక్తి విద్యార్థిలోకానికి నానాటికీ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుచేత విద్యార్థుల సౌకర్యార్థం అలాంటి కావ్యాలకు సమర్థులైన పండితులచేత వ్యాఖ్యానాలు రచింపజేసే ప్రణాళికను వ్యాఖ్యాస్రవంతి పేర తెలుగు విశ్వవిద్యాలయం చేపట్టింది

“కుమార సంభవం” పండ్రెం డాశ్వాసాల మహాకావ్యం మొత్తం కావ్యం వ్యాఖ్యానంతో సువిస్తృతం అయింది కాబట్టి దానిని రెండు సంపుటాలుగా ప్రకటింప తలపెట్టడమైనది మొదటి ఆరు ఆశ్వాసాలూ ఒక సంపుటంలోనూ, తరువాతి ఆరు ఆశ్వాసాలూ రెండో సంపుటంలోనూ ఉంటాయి. మొదటి ఆరాశ్వాసాల సంపుటం ఇదివరకే (1994) వచ్చింది ఇప్పుడు ఇది రెండో సంపుటం ఇందులో ఏడవ ఆశ్వాసం మొదలుకొని పన్నెండవ ఆశ్వాసం వరకు వ్యాఖ్యానం సుసజ్జితమై ఉంది

ఈ క్లిష్టమైన కావ్యానికి సమగ్రమైన వ్యాఖ్యానం వ్రాసి మా కందించిన వారు శ్రీ మృత్యుంజయరావుగారు

నాయని కృష్ణకుమారి

ఉపాధ్యక్షులు

తేది 16-4-1998