పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పద్యంబేల పసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై
వేద్యంబేల? పదార్థ చోరునకు నుర్విన్ వేదవేదాంత స
ద్విద్యాభ్యాసక బుద్ధియేల? మదిభావింపంగ నెల్లప్పుడున్
మద్యం బానెడు వానికేల సుధ? రామా! భక్తమందారమా!

60


మ.

ముకురంబేటికి గ్రుడ్డివానికి, జనామోదానుసంధాన రూ
పకళాకౌశలకామినీ సురతలిప్సాబుద్ధి ద్ధాత్రిన్నపుం
సకతం గుందెడు వానికేమిటికి, మీసంబేటికిన్ లోభికిన్
మకుటంబేటికి మర్కటంబునకు రామా! భక్తమందారమా!

61


మ.

కుజనున్ ధర్మతనూజుఁదంచు నతుమూర్ఖున్ భోజరాజంచు ఘో
రజరాభార కురూపకారిని రమారామాకుమారుండటం
చు జడత్వంబునవేఁడి కాకవులు కాసుంగాన రెన్నంగ సా
మజ రాజోగ్రవిపద్దశాపహర! రామా! భక్తమందారమా!

62


మ.

చలదశ్వద్ధతరుప్రవాళమనుచున్ సారంగ హేరంబటం
చలరుందింటెన పూవటంచు ముకురంబంచున్ భ్రమన్ సజ్జనుల్
కళలూరంగ రమించుచున్ వదలరే కాలంబు ముగ్ధాంగనా
మలమూత్రకర మారమందిరము రామా! భక్తమందారమా!

63


మ.

సుదతీపీనపయోధర ద్వయముపై సొంపొందు నెమ్మోముపై
మదనాగారముపైఁ గపోలములపై మధ్యప్రదేశంబుపై
రదనావాసంబు పయిన్నితంబముపయిన్ రాజిల్లు నెంతేని దుర్
ర్మద వృత్తిన్ ఖలుచిత్త మిద్ధరణి రామా! భక్తమందారమా!

64


మ.

రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ట సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికిఁ జేరన్ లేక విభ్రాంతిచేఁ
బసులం గాచిన మోతకొయ్య దొరలం బ్రార్థింతు రెంతేని దే
మసగాదే యిది యెంచి చూచినను రామా! భక్తమందారమా!

65