పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

నిక్కంబరాయంధావకాంఘ్రి విలసన్నీరే రుహ ద్వంద్వమే
దిక్కెల్లప్పుడు మా కటంచు మదినెంతే వేడ్క భావించె దన్
జిక్కుల్ పన్నక నమ్మికిచ్చి సరగం జేపట్టి రక్షింపు స
మ్యక్కారుణ్యకటాక్ష వీక్ష నను రామా! భక్తమందారమా!

18


మ.

అతసీపుష్పసమాన కోమల వినీలాంగున్ సముద్య న్మహో
న్నతకోదండ నిషంగగంగు బలవ న్నక్తంచరాఖర్వ ప
ర్వత జీమూత తురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంత ర
మ్యతరాపాంగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా!

19


శా.

ఆర్తత్రాణ పరాయణుండ వని నిన్నత్యంతమున్ సజ్జను
ల్గీర్తింపన్ విని తావకీన పదనాళీక ద్వయంబాత్మ వి
స్ఫూర్తింజెందఁగనెంతు నెల్లపుడు నన్బోషింపు మీ సత్కృపన్
మార్తాండ ద్విజరాజ సన్నయన! రామా! భక్తమందారమా!

20


మ.

మదనాగాశ్వ శతాంగకాంచన కసన్మాణిక్య భూషామృగీ
మద దివ్యాంబర చామరధ్వజ లస న్మంజూషికాందోళికా
మృదు తల్పార్ధ సమృద్ధిగల్గి పిదప న్నీ సన్నిధిం జేరు నిన్
మదిలో నెప్పుడు గొల్చు మానవుఁడు రామా! భక్తమందారమా!

21


శా.

శ్రీకం ఠాబుజ సంభవేంద్ర రవిశోచిష్కేశ ముఖ్యమరా
నీకంబుల్ గడుభక్తి నిన్ గొలిచి పూంకిన్ ధన్యులైనారు నేఁ
డాకాంక్షన్ భజియింతు మేమఱక చిత్తూనంద మొందింపుమా
మాకుం బ్రాపును దాపు నీ వగుచు రామా! భక్తమందారమా!

22


మ.

కరి రా, జార్జున, పుందరీక, శుక, గంగానందన, వ్యాసులున్
పరమాధీశ, బలీంద్ర, మారుతసుతుల్, సంప్రితి సద్భక్తి మీ
పరమాంఘ్రిద్వయ చింతనాభిరతిమైఁ ద్రాపించిరౌ సద్గతిన్
స్మరకోటి ప్రతిమాన రూపయుత రామా! భక్తమందారమా!

23