పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

చెనఁతుల్గూర్చుధనంబుమ్రుచ్చులకు దాసీవారయోషాహు
తాశన దుష్టక్షితిపాలక ప్రతతికిన్ సంరూఢిఁ జేకూరుగా,
కనపద్యప్రతిభావిభాసిత బుధేంద్రానీకముం జేరునే?
కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా!

90


మ.

ధరణిన్ సద్గురుచెంత నెందఱుఖలుల్ దార్కొన్ననచ్చోటికే
కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా
వరణోజ్జృంభితకేతకీవని కరుల్ వాలెంబుగాఁ జేరవే?
కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా!

91


శా.

లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప
ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనే దురాలాపంబులంగేరుచుం
గైకొండ్రెల్లపదార్థల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు
న్గాకు ల్వేములఁ జేరుచందమున భర్గా! పార్వతీవల్లభా!

92


మ.

చదువు ల్వేదపురాందము ల్గయితలు స్సబ్బండువిద్దెల్ గతల్
మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగావింటిఁగా
నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్
గదియంజాల వటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా!

93


శా.

పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల
న్వాపోఁజాగితివేమి! నిసదువు తిర్నామంబులో! సుద్దులో
భూపాళంబులొ లంకసత్తెలొ బలా బొల్ల్యావుపోట్లాటలో
కా! పాటింపనటండ్రుబాలిశులు భర్గా! పార్వతీవల్లభా!

94


మ.

అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో
నదనం"గిద్దెఁడుకొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్
సదువంజాగిన మాలదాసరయలన్ సంతోసనాల్ సేసితిం
గద" యంచుంబలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా!

95