పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకంబద్యాదులర్పించినం
గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండునిక్కంబహా!
దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ
ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా!

84


మ.

భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె
స్రవళిన్ సంతలనెల్లఁదిప్పు క్రియ దైన్యంబెచ్చఁగా దుష్కవుల్
తివుటొప్పం జెడుకబ్బపుందడక లోలిం ద్రిప్పఁగా నద్దిరా!
కవితల్ కాసుకు గంపెఁడయ్యెఁగద భర్గా! పార్వతీవల్లభా!

85


మ.

అవివేకక్షితినాయకాధమసభా భ్యాస ప్రదేశంబులన్
బవళు ల్రేలునుజుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యముల్చూపుచుం
గవిముఖ్యుంబొడగాంచి జాఱుదురు వేగం; బుండవి ల్గన్న కా
కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా!

86


మ.

భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్
బవినాలున్బలుమోటకాఁపుదొరలుం బాషాండులు న్దాసరుల్
సివసత్తుల్ నెఱబోయపెద్దలును దాసేయుప్రభుల్ దుష్టకా
కవులు న్మీఱిరికేమి చెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!

87


మ.

కలుముల్నిక్క మటంచునమ్మితులువల్గర్వాంధులై యెన్నఁడు
న్బిలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులంబాసియా
ఖలులృమౌదురో, వాండ్రుగూరిచినరొక్కం బెల్ల నేమౌనొకో
కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా!

88


మ.

తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతోనెమ్మదింగూర్చిమూ
లల దట్టంబుగఁబాఁతుకొన్న నృపతుల్వాలెంబు నిర్మోహులై
పలుచందంబులఁ గట్టి కొట్టి మిగులన్భాదించి రోధించుచుం
గలసొ మ్మెల్ల హరించుచుండ్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

89