పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్
ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య
క్కజమొప్పంబలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ
ర్మజయౌద్ధత్యము లేక్రియంగలుగు? భర్గా! పార్వతీవల్లభా!

72


శా.

తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ
పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముంగంటకున్
వ్యాజంబూనికడుంజెడంగవలెనా యాలింపరా యీనృపుల్
"రా జాంతే నరకం వ్రజే"త్తనుట? భర్గా! పార్వతీవల్లభా!

73


శా.

ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్
భోజుంబోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్
తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో
రాజా వాఁడు? తరాజుగాక! భువి, భర్గా! పార్వతీవల్లభా!

74


మ.

కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా
సి వడిం జేతులుదోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె
క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రంగిన ట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమియీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా!

75


శా.

గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ
నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ
నా? జిల్లేడు సురావనీజ మగునా? నానాదిగంతంబులన్
రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా!

76


శా.

కోపంబెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబుతీల్,
కాపట్యంబుఘనంబు, లోభమునహంకారంబు దట్టంబు, హృ
చ్చాపల్యం బధికంబు, ద్రోహమతి విస్తారంబు, చీ! యిట్టిదు
ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక భర్గా! పార్వతీవల్లభా!

77