పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ద్విపగంధర్వవిభూషణాంబరవధూవీటీభటాందోళికా
తపనీదేయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ
తపనప్రోద్భవఘోరకింకరగదా దండోగ్రదుఃఖంబు లొ
క్కపుడుందుష్ప్రభులేలయెంచరొకొ? భర్గా! పార్వతీవల్లభా!

66


మ.

శివుఁజూడందగదండ్రు గొందఱధముల్ చిత్రంబుతారెన్నఁడు
న్రవిచంద్రాగ్ని గృహిక్షమాపవనీరవ్యోమముల్ నీస్వరూ
పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం
గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా!

67


శా.

నానాద్వీపధరాధురావహనమాన్యస్ఫారబాహాబలా
నూనఖ్యాతిసమేతు లైన శశిబిందుక్ష్మాతలేశాదిక
క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్?
కానంజాలరుగాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా!

68


మ.

చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్ఛాలీలలంబ్రేలుదు
ష్కవులన్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో
నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ
కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా!

69


మ.

చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్త్రాదులం
గలవిత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రధ్యక్షతం
దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై
కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా!

70


శా.

మన్నెల్లందమసొమ్మటంచు వసుధా మార్త్యోత్తమక్షేత్రముల్
కన్నారంగని యోర్వలేక దిగమ్రింగం జూతురల్పప్రభుల్
వెన్నప్పంబులొ బూరెలో వడలొ భావింపంగ నొబ్బట్లొకో
యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా!

71