పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

కంఠేకాలుఁడటంచు నిన్నెపుడు లోకవ్రాత మగ్గింప వై
కుంఠేంద్రాంబుజ సంభవ ప్రముఖులం గోలాహల ప్రక్రియం
గుంఠీభూతులఁజేయు దుర్భయద కాకోలంబు హేలాగతిన్
గంఠాగ్రంబునఁబూనినాడవట! భర్గా! పార్వతీవల్లభా!

24


మ.

నిను డెందంబునఁ జీరికిం గొనక వాణీనాధ జంభ ద్విష
ద్దను జారి ప్రము ఖాఖిలామర తతిన్ దట్టంబుగాఁ గూర్చియా
మున జన్నం బొనరించు దక్షుని దురాత్మున్వీరభద్రోగ్రసం
హననం బూని వధించితౌర! భళి! భర్గా! పార్వతీవల్లభా!

25


మ.

కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ
చరణంబుల్ శిరము న్గనందలఁచి నిచ్చల్భోగిలోకంబు, పు
ష్కర మార్గంబునురోసి కానక నిరాశంజెందుచో వారలం
గరుణం బ్రోవవె లింగమూర్తివయి! భర్గా! పార్వతీవల్లభా!

26


మ.

తరమే యేరికిఁదావకీన ఘననిత్యశ్రీ విలాస క్రియల్
గరిమన్దెల్పఁగ? దారుకావనిని లోకఖ్యాతిగా వర్ణివై
పరమానంద రసార్ద్రమానసుడవై పల్మాఱు గ్రీడించితే
నరుదార న్మునిదారలం గలిసి భర్గా! పార్వతీవల్లభా!

27


మ.

హరికన్న న్మఱి దైవ మెవ్వఁడును లేఁడంచున్భుజం బెత్తి ని
ర్భర గర్వోద్ధతిఁగాశికానగరిలోఁ బల్మాఱు వాదించు ని
ష్ఠురవాగ్దోషరతుం బరాశరసుతున్ స్రుక్కింపవే భీమవై
ఖరి దోఃస్థంభన మాచరించి మును భర్గా! పార్వతీవల్లభా!

28


మ.

దనుజారాతి మృదంగమున్నలువకై తాళంబు గోత్రాహితుం
డెనయన్వేణువు వాణివీణయును వాయింపన్ రమాకాంతనే
ర్పున గానం బొనరింప సంజతఱి వేల్పుల్మెచ్చఁగా హాళిమై
ఘనతన్ దాండవకేళి సేయుదఁట! భర్గా! పార్వతీవల్లభా!

29