పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

పురుహూతాగ్ని పరేతరాట్పలభు గంభో దీశ వాతార్థ పాం
బరకేశాబ్జ భవాచ్యుతాదిక మహాబర్హిర్ముఖానేక భా
స్వరకార్తస్వర విస్ఫురన్మకుట శాశ్వత్పద్మ రాగప్రభో
త్కర నీరాజితపాద పంకరుహ! భర్గా! పార్వతీవల్లభా!

18


శా.

వ్యాకీర్ణాచ్ఛ జటాటవీ తటనితాంతాలంబితోద్యత్తమి
స్రాకాంత ప్రథిత ప్రభాసముదయాశ్రాంత ప్రఫుల్లన్మహా
నాకద్వీపవతీ వినిర్మిల జలాంతర్భాగ భాగ్దివ్యరే
ఖాకాంతోత్పల కైరవ ప్రకర! భర్గా! పార్వతీవల్లభా!

19


మ.

సతతానందితసర్గ! సర్వసుమనస్సంతుత్యసన్మార్గ! యూ
ర్జిత కారుణ్యనిసర్గ! రాజతధరిత్రీ భృన్మహాదుర్గ! హృ
త్కతుకాలింగిత దుర్గ! సంహృత సమిద్ఘోరద్విషద్వర్గ! సం
యుత నీరంధ్ర సుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా!

20


మ.

పుర రక్షః వటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో
పరిపంథిక్షణ దాచరోరగ మహాపక్షీంద్ర! ఘోరాంధకా
సురగంధ ద్విరదేంద్ర పంచముఖ! యక్షుద్ర ప్రభావోల్లస
త్కరిలేఖద్విషదభ్రగంధవహ! భర్గా! పార్వతీవల్లభా!

21


మ.

అమరాహార్యము విల్లుగా ఫణికులాధ్యక్షుండు తన్మౌరిగాఁ
గమలాధీశుఁడు తూపుగా, నిగమముల్ గంధర్వముల్ గాగ స
ర్వమహీ చక్రముఁదేరుఁజేసి విధి సారథ్యంబు మీఱం బరా
క్రమలీలన్ దిగప్రోళ్ళఁ గూల్చితివి భర్గా! పార్వతీవల్లభా!

22


మ.

కోటీరాంగద మేఖలాఘనతులా కోటికవాటీ నట
ద్ఘోటీ హాటకపేటికా భటవధూకోటీ నటాందోళికా
వీటీ నాటక చేటికాంబరతతుల్ వే చేకుఱు న్నిన్నిరా
ఘాటప్రౌఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా!

23