పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రంగారాయచరిత్రము


త్రులగుమంత్రులును నాయకులును గాయకులును దక్కుఁ
గలపరివారంబు గొలువఁ గొలువుండి గోష్ఠీవినోదంబున.

12


మ.

ననునానాపృథివీంద్రచంద్రకృతసన్మానున్ రఘూత్తంస పా
వనపాదాంబుజసేవనానిరతు సత్ప్రాచీనవిద్వత్కవీ
శనికాయాదరణీయ దిట్టకవివంశప్రోద్భవున్ ధీరసా
యను నారాయణుఁ జూచి యిట్లు పలికెన్ హర్షాంబుధిం దేల్చుచున్.

13


తే.

హైమభూపావిశేషవర్షాశనాగ్ర
హారముఖ్యబహూకృతుల్ గారవమున
నందుకొంటివి మాచేత నస్మదాశ్రి
తాగ్రణివి దిట్టకవిరాజ యరుణతేజ.

14


ఉ.

భారతయుద్ధమట్టు లతిభాసురతం గనుపట్టుచు న్మహా
వీరరసప్రధాన మయి వేడుక నింపెడు రావువారిదు
ర్వారరణప్రసంగ మతిరమ్యతరం బది గద్యపద్యసం
భారయుతంబుగా నొకప్రబంధ మొనర్పు మదంకితంబుగన్.

15


వ.

అని యనూనయింపుచుం బరిమళపరిమిళిత కర్పూరవీటీ
కనకశాటీనిరాఘాటధాటీజనవఘోటీపరంపరాది సత్కా
రంబులఁ బ్రియంబుఁగొలుపుటయుం గౌతూహలంబు వొ
డమి తత్ప్రారంభంబునకు మంగళోజ్జృంభణంబుగాఁ గృతి
పతివంశావతారం బభివర్ణించెద.

16


మ.

సనకాదు ల్భజియింతు రెవ్వని పదాజ్ఞాతంబునే పుణ్యశీ
లుని యంఘ్రిన్ జనియించి జాహ్నవి కడున్ లోకత్రయీలోకపా
వని యౌనట్టి రమామనోహరుని దివ్యశ్రీపదాంభోరుహం