పుట:2015.373190.Athma-Charitramu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 54

ఏతన్మతస్వీకారము చేసి క్రైస్తవాచారముల ననుసరించినఁ గాని మనదేశమున కైహికాముష్మికములు లే వని విశ్వసించెడివాఁడను ! ఇట్టియూహలలోఁ గొంత సత్య మున్నను, ఇదియే యమోఘ సత్యము గా దని నేను గ్రహించి, మతవిషయమై నామనస్సున మఱికొంత మార్పు నొందినసందర్భ మిఁకఁ దెలిపెదను.

15. రామభజనసమాజ సంస్కరణము

1888 వ సంవత్సరాంతమున మాతండ్రి ఇన్నిసు పేట మధ్యభాగమున నొకచిన్న యిల్లు స్థలమును గొనెను. మఱుసటి సంవత్సరారంభమున మే మచటికిఁ బోయి, దాని కెదురుగ నున్న దేవరకొండవారియింటఁ గాపుర ముంటిమి. చెంతనుండు నొకయింట ప్రతి శనివారమురాత్రియుఁ గొందఱు యువకులు చేరి, రామభజన జరుపుచుండి, నన్ను తమసమాజమున కధ్యక్షునిఁ జేసిరి. రాత్రులు చాలసేపు ఎలుగెత్తి వారు గీతములు పాడుటవలన నిరుగుపొరుగువారల నిద్రకు నెమ్మదికిని భంగము గలుగుచుండెడిది. మాయింట రెండవ భాగమునఁ గాపురముండు నొకయుద్యోగి యొకనాఁడు, "ఈ రామభజన కడు బాధాకరముగా నున్నదే !" యని మొఱపెట్టఁగా, నే నాయనతో వాదమునకు డీకొని, బాలపామరుల కట్టి భజన లాభదాయక మని చెప్పివేసితిని. ఒకటి రెండుమాఱులు మా తండ్రియును రామభజనసమాజమువారిని గుఱించి విసిగికొని, వారితో జోక్యము కలుగఁజేసికొన వలదని నన్ను మందలించెను. అంతకంతకు రామభజనసమాజమువారి పోకడలు నాకును దుస్సహము లయ్యెను. ప్రార్థన సమయమున వారు రామునిపటమును ముందుంచుకొని, దానికి ధూప దీపనై వేద్యములు సమర్పించెడివారు. క్రీస్తుబోధనానుసారముగ మాన