పుట:2015.373190.Athma-Charitramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 50

రాక్షసు లనిన భయము, రామలక్ష్మణులయందు ప్రేమమును నా హృదయమున నంకురించెను. ఆమఱుసటియేఁట రేలంగిలో చెలికాండ్ర సహవాసమహిమమున కృష్ణుఁడు నా కిష్టదైవత మయ్యెను. మాతల్లికి రామునియందు భక్తి. మాతండ్రి శివభక్తుఁ డయ్యును, ఒకటిరెండుమాఱులు నాచేత బాగవతములోని 'బాణాసురకథ' చదివించి, నాకర్థము చెప్పెను. అందలి విష్ణుని యుత్కర్ష నాబాల్యవైష్ణవమును ముదురఁబెట్టెను ! తదాదిగ, 1888 వ సంవత్సర మధ్యకాలమువఱకును, శివకేశవులలో కేశవు నధికునిగ నెంచి, నేను భారతభాగవతాది గ్రంథములు చదువుచు, నారాయణభక్తిపరుఁడ నై యుంటిని.

ఇటీవల కొంతకాలమునుండి నేను జదువు బైబిలుగ్రంథము, చేయుక్రైస్తవస్నేహితుల సహవాసమును, నాకు క్రైస్తవమతాభి మున ముదయింపఁజేసెను. ఆసంవత్సరము ఆగష్టు 7 వ తేదీదినచర్య యందు, "ఆపరమపవిత్రప్రవక్త యగుయేసుక్రీస్తును గుఱించి చదివితిని" అని యున్నది. 9 వ తేదీపుటలో, "భగవంతుడా ! ఐహిక విషయములను గుఱించి నామనస్సును కళవళపడనీయకుము. నే ననవరతము నీప్రేమామృతమును గ్రోలనిమ్ము. ఎపుడును నిన్ను ప్రార్థింతునుగాక !" అని లిఖింపఁబడెను. అప్పటినుండియు కష్ట మావహిల్లి నపు డెల్ల, భగవన్నామచింతనము నాదినచర్యయందు సూచింపఁబడు చుండెను. అక్టోబరు 28 వ తేదీని, "క్రైస్తవదేవాలయమునకు వెళ్లితిని" అని యుండెను. మఱునాఁటిదినచర్యయందు, నేను కొలఁదికాలములో మృత్యుముఖముఁ జొచ్చుట నిశ్చయ మని యెంచి నే గావించిన యొకదీర్ఘప్రార్థనము గానఁబడుచున్నది. అందు, నేను పాపి ననియు, తలంపులందు కలుషితుఁడ నినియు, నాదుశ్చింతలే యాత్మ శాంతిని బారఁద్రోలి శరీరమును మనస్సును గాకుచేసి నా నీతికుసుమ