పుట:2015.373190.Athma-Charitramu.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 648

జేయును. కాని, తోడనే యాయన యిఱుప్రక్కలను ప్రక్కలు బద్దలగునట్టుగ విద్యార్థుల నవ్వు విన నగును. చేత గొడుగైన బెత్తమైన నున్నచో, అది యపు డెగురవలసినదె ! మంచికొ చెడ్డకొ, ఆయనకోపము చివఱవఱకు కొనసాగవలసినదె. కాని స్నేహము ఆయన యనుగ్రహమునకె నీవు పాల్పడినచో, నీ కాతని స్నేహము, తలవని తోడ్పాటును ప్రాప్తింపఁ గలవు.

"ఆయనజ్ఞానము అపారగాంభీర్యము గలది. నిండుకుండ తొణకని రీతిని, యాయన పాండిత్యము ప్రకటనమును కోరదు. వలసినచో, గణగణమని మ్రోగు పెద్ద పదజాల మతని సొమ్మె! ఇవి యనుభవింపనోచుకొననివానికి, బల్లమీఁద పడెడి యాతని పిడికిలి చప్పుడు, అతని యభినయమును గనులు విప్పును ! ఆయనకుఁ గల నటనాసామర్థ్య మపారము. దేవత దయ్యము, సాధుపుంగవుఁడు ఘోర కపటుఁడు, రాజు భిక్షువు, విద్యాధికుఁడు కటికపామరుఁడు, జ్ఞాని పిచ్చివాఁడు, కోప పరితాపానందములు, - ఇవి యన్నియు నొక నోటనే యాయన యద్భుతముగఁ బ్రదర్శింపఁ గలఁడు. ఇపుడైన మాతృకను కళాశాలా విద్యార్థి పోల్పఁగలిగెనా ? లేనిచో, గోల్డుస్మిత్తునే సమాధినుండి గైకొని రావలెను !"

[కళాశాలా పఠన మందిరములో విద్యార్థులు ఉపాధ్యాయులను పరిహసించి వ్రాసెడి వ్రాత పత్రికలున్నవని నాకుఁ దెలిసి, అందు నే నొకనాఁడు పై పత్రికను జూచి యది దీసివైచి, ముందిట్టి పిచ్చివ్రాఁతలు వ్రాయవలదని విద్యార్థి బృందమును వారించితిని. తల్లిని కొట్టరా వసంతమనునట్లు, ఒక సీనియరు విద్యార్థి నన్నా పత్రికలోఁ జిత్రింప యత్నించెను.]