పుట:2015.373190.Athma-Charitramu.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 644

గడుపవచ్చును గాని, లోకవిషయములమీఁది మోహమునబడియుండ రాదు. మనవిధ్యుక్తముల నెఱవేర్చి, ఫలసిద్ధి దేవునికే వదలివేయవలెను. అశాశ్వతమగు ప్రాపంచిక విషయములను బట్టుకొని ప్రాకులాడక, జ్ఞానియంతచ్ఛక్షువునువిప్పి, పరమాత్మునే సందర్శింప గోరుచుండును. * * * కావున, మనపిల్లవాని (అబ్బావుని) యకాలమరణమును మఱపుతెచ్చుకొని నీవు చిత్తశాంతితో నుండవలయును. * * *

రాయసం వెంకటరామయ్య.

(24)

భీమవరము, 4-3-31

అన్నయ్యకు, మీలేఖకు వెంటనే ప్రత్యుత్తర మీయజాలనందుకు క్షమింపవలెను.

మన కీమధ్యగలిగిన విపత్తును (మూడవ కుమారుడు సూర్యనారాయణుని మరణమును) గుర్తించలేనట్టుగ మొదటిదినములలో నాబుద్ధిని మాంద్యము గ్రమ్మివేసెను ! ఆమాంద్యము విడిపోయినకొలఁది నాకిపుడు నాదురవస్థ స్ఫుటముగ గోచరించుచున్నది. జీవితము దుర్భరముగ నున్నది. చనిపోయిన ప్రియపుత్రునికిఁ జేయవలసిన విధులు చేయక, వానిని మృత్యుదేవత కొప్పగించితినని పొక్కుచున్నాను. ఇంక పాపిష్ఠిధనార్జనముచేయుట సిగ్గులచేటని నేను మొగము చాటువేసి, యిల్లువిడువకున్నాను. నిండుజవ్వనమున నుండు నా ముద్దుల బాలకునిమీఁదికి విధినాధునికి చేతు లెట్లువచ్చెనో ! నాయేఘోర పాపమునకు దైవ మీశిక్షనంపెనోగదా!