పుట:2015.373190.Athma-Charitramu.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 643

యస్తికలు సమాధిలో నిక్షేపించు కర్మకాండను జరిపెదము. మీ రాసమయమునకు రావలయును. నా దేహమున ససిగా లేదు. అందుచేత ఏప్రిలు మొదటిభాగముననే నేను బెంగుళూరు పోయెదను.

కం. వీరేశలింగము.

(22)

రాజమంద్రి, 19-3-1911

ప్రియస్నేహితా, మీప్రేమపూర్వక మగు లేఖ నందుకొన్నాను. మీ రంపిన విరాళ మందినదని నేను వ్రాయలేదా ? పొరపాటు క్షమింపవలెను. నా "స్వీయచరిత్రము"ను గుఱించి మీకుఁగల సదభిప్రాయమునకు వందనములు. మీ పూర్వగురుమిత్రుని యెడగల యభిమానమె దీనికి గొంత కారణమయి యుండవచ్చును.

రాబోవు నెలలో నరసాపురమున జరుగు కృష్ణా - గుంటూరు మండల సంఘ సంస్కరణ సభకు మీ రధ్యక్షులుగ నెన్నుకొనబడినందుకు సంతోషించు చున్నాను.

  • * 24 వ తేదీ శుక్రవారమునాఁడు బెంగుళూరు పోవుచున్నాను. మార్గమధ్యమున మద్రాసులో శ్రీ గోటేటి కనకరాజుగారి యింట రెండు మూఁడు దినము లాతిధ్య మనుభవింతును.

కం. వీరేశలింగము.

(23)

భీమవరము. 1-9-17

అన్నయ్యకు, పనితొందరచేత, ఇదివఱకే వ్రాయలేకపోయితిని. గతించినదానికి వగచిన లాభములేదు. లోకములో జీవితము