పుట:2015.373190.Athma-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 30

త్సరారంభమున నాయనజీవములఁ గొనిపోయెను. అన్న వ్యాధిసమాచారమును సకాలమున నేను దెలుపకుండిన హేతువున, కన్నులార నాయనను గడసారి చూడలేకుంటి నని మాతండ్రి మిగుల వగచెను.

రాజమంద్రి పోయినది మొదలు ఉన్నతపాఠశాలలో నేను జదువు పూర్తిచేసిన యైదు సంవత్సరములలోను, నేను దమ్ములును బయటి సహవాసుల నంతగ నెఱుఁగమనియే చెప్పవచ్చును ! ఇంట మాతమ్ములు చెల్లెండ్రు, పాఠశాలలో సహపాఠులును, మా ముఖ్యసహవాసులు. నేను మాధ్యమికపరీక్షతరగతిలోఁ జదువునపుడు, అనఁగా 1884 వ సంవత్సరమున, మా తరగతిలోని నా పరిచితులలో కూనపులి కొండయ్యశాస్త్రి ముఖ్యుఁడు. తరగతిలోఁ దెలివి గలవారలలో శాస్త్రి యొకఁడు. అచిరకాలములోనే నే నీతనిని మించి మొదటివాఁడ నైతిని. అప్పటినుండియు నా కితఁడు సహవాసుఁ డయ్యెను. ప్రభుత్వమువారి మాధ్యమికపరీక్షలో మాపాఠశాలలో మొదటితరగతిని జయము నొందిన నలుగురిలో నే నొకఁడను. కొండయ్యశాస్త్రి మాత్రము మూఁడవతరగతి నైనఁ దేఱక, మరలమరల క్రింది తరగతియందే కాలము గడుపచుండెను. ఈతఁడు నావలెనే ఇన్నిసుపేటలో నివసించెడివాఁడు. సాయంకాలమునను, సెలవు దినములందును, శాస్త్రి మాయింటికి వచ్చి, నన్ను షికారునకుఁ గొనిపోవుచుండును. నా వెనుకటి సహపాఠియు, మొగమెఱిఁగిన విద్యార్థియు నగుటచేత, నే నాతని సావాసమున నుండుటకు మాతల్లి యభ్యంతరము పెట్టెడిది కాదు. లోకవిషయములు నాకుఁ దెలుపుచు, పాఠ్యగ్రంథములందు నిమగ్న మైన నామనస్సునకు, శాస్త్రి కొంత విరామము గలిగించుచుండువాఁడు. సాహిత్య విషయములందు తనకుఁగల యభిరుచి నాకును గలిపింప నితఁడు ప్రయత్నించుచుండువాఁడు. ఇతనిసం