పుట:2015.373190.Athma-Charitramu.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 631

వరదాచార్యులుగా రిపు డిక్కడ లే రని చెప్పుటకు చింతిల్లుచున్నాను. క్షయవ్యాధివలన బాధపడుచుండుటచేత, ఇక్కడ వచ్చినవెంటనే ఆయనను బొంబాయివిడిచిపొం డని వైద్యులు చెప్పివేసిరి. కొంతకాల మతడు బళ్లారిలోనుండి, యిపుడు చెన్నపురివెళ్లి పోయెనని వినుచున్నాను. కాబట్టి మామద్రాసు ప్రవాసకులసంఖ్య రెండుక్రింద తగ్గిపోయెను. గంటి లక్ష్మీనరసింహముగారు నేనును మాకార్యాలయమున నొకగదిలో నున్నాము. మీసందేశ మిపుడె యాయనకు దెలిపెదను. ఇంటియొద్దనుండు మిత్రులు మమ్ము మరకు పోవుదురేమోకాని, మేము వారినిమాత్రము మరచిపోవుటకు వీలులేదు.

సుహృదుడు, కె. నటరాజను.

(7)

బండోర, 19 వ తేది నవంబరు, 1901.

ప్రియమైన వెంకట శివుడుగారికి, మీరంపిన వ్యాసములకై వందనములు. ముందునుండి మీకు మాపత్రికప్రతులు రెండేసి పంపెదము. మీమిత్రుల కొకప్రతి మీరు పంపవచ్చును.

సర్కారులనుండి 'వార్తలు వ్యాఖ్యలు' ను క్రమముగా పంపుచుండుడని మిమ్ముకోరుచున్నాను. ఈపత్రిక కని యొక విశేషమయి, దాని యుపయోగమును హెచ్చింపగలవు.

విద్యాబోధకుని గుఱించిన మీవ్యాసము మిగుల చక్కగ నున్నది. శైలి సొగసుగను, నిర్దుష్టముగను నున్నది. వాదన సహేతుకముగ నున్నది. ఎపుడును మీశ్రేయస్సు వినగోరు, మిత్రుడు.

కె. నటరాజను.