పుట:2015.373190.Athma-Charitramu.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 630

తిని. వాళ్లను వెంకయ్య మామ 5 తేదీకి తీసుకొనివచ్చును. ఏడు రూపాయిలకుపైగా కరీదు గల పుస్తకములు కావలసి, మద్రాసు వ్రాసితిని. పుస్తకములు వచ్చినవి కాని డబ్బులేదు. ఈరోజుననే నాజీతము పదిరూపాయిలు చెల్లించితిని. కాబట్టి నాపేర ఎనిమిది రూపాయిలు నీవు పంపవలెను. "ఆంధ్రకవులు" 3 వ భాగము నాకు పంపవలెను. * * మన కనకమ్మ అర్తమూరులో నున్నది. మంత్రిరావు వెంకటరత్నము వచ్చినాడు కాని, చెల్లెలిని తీసికొని రాలేదు.

రాయసం సూర్యనారాయణ.

(6)

హిందూ సంఘసంస్కారిణి - బొంబాయి, 5 నవంబరు 1901 : _

ప్రియులగు వెంకటశివుడుగారికి, "ఉపాధ్యాయునివిధుల"ను గూర్చిన మీవ్యాసము పంపినందుకు వందనములు. మీవ్యాసములన్నిటివలెనే యిదియును చక్కనిభావములతోను హితోపదేశములతోను విలసిల్లుచున్నది. అది మీ కోరికచొప్పున మాపత్రికరాబోవు సంచికలలో ప్రచురింపబడును.

"హిందూసంఘ సంస్కారిణి"ని గుఱించిన, మీ యభినందనములకు వందనములు. బొంబాయికి వచ్చినపిమ్మట మాపత్రిక చందాదారు లెక్కువయైరని వినుట మీకు సంతోషదాయకముగ నుండును. మీవంటి విలేఖకుల వ్యాసములుండినచో పత్రిక యింకను వృద్ధినొందును. కావున మీరేమివ్రాసినను సంతోషింతును. చిన్నదని మీరు సందేహవలదు. ఒక పేరా అయినను పంపవచ్చును.