పుట:2015.373190.Athma-Charitramu.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 629

వారం మీ అప్ప తాళ్లపూడి వెళ్లి కృష్ణయ్యభార్యను తీసుకువచ్చినది. యేలూరుసాహేబు రేయలీ డ్రెస్సరుగారికిన్ని చూపించినాము. మేహజ్వరంచాత రక్తం తక్కువైనదని చెప్పినారు. * * బాలసూర్యోదయం మొదలయినవి యిప్పిస్తే 20 రోజులలో నిమ్మళిస్తుంది. * * నీవు యెప్పుడు వచ్చేదిన్ని వ్రాయించవలెను.

రా. సుబ్బారాయుడు.

(4)

6-4-1901

మహారాజశ్రీ అన్నయ్యగారి సన్నిధికి, చెల్లెలు కనకమ్మ వందనములు. ఇక్కడ అంతా కులాసాగానే ఉన్నారు. మీరు నిన్నటి వరకు ఇక్కడకు వచ్చెద రని తలచితిమి. అట్లు జరిగినదికాదు. చిన్న అమ్మాయి వెనుకటివలె ఏడుపు మొదలైనవి మానుటయేకాక, ఆటలు, నవ్వును ! ఉగ్గు మొదలగు చిన్నచిన్నమాటలను నేర్చి కొంచెము ధృఢపడినది. మీరును వదినగారును త్వరలోనే చూడ ప్రయత్నించెదరని తలచెదను. మీరు ఇక్కడకు వచ్చునప్పుడు, పిల్లకు ఒక కాసు ఒత్తులును, కాళ్లకు పెట్టుటకు గజ్జెలును, మా వదినగారితో చెప్పి చేయించ కోరెదను. తప్పకుండా చేయించకోరెదను. అప్ప ఇప్పుడు బాగానే ఉన్నది. చిత్తగించవలెను.

కనకమ్మ.

(5)

రాజమంద్రి, 3-7-1901

అన్నయ్యకు, ఇక్కడ అంతాక్షేమం. మనతల్లిని చెల్లెలిని 26 వ జూనున వేలివెన్నుతీసికొనివెళ్లి, దిగబెట్టి, 1 వ తేదీకి వచ్చి