పుట:2015.373190.Athma-Charitramu.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 628

మీరిచటికి వచ్చినపుడు మంచిపుస్తకములు రెండిచ్చెద మని చెప్పినందుకు వందనములు. వానివల్ల లాభ మందగోరుచున్నాను. * * శ్రీ సుబ్బయ్య పాపయ్యగార్లు ఇక్కడనే యున్నారు.

ప్రేమాన్వితుడు, త. రంగనాయకులు.

(2)

రాజమంద్రి, 16-1-1896

ప్రియసోదరా,

నాసెలవును గుఱించి చిక్కులు వచ్చినవి. ఐనను భయము లేదు. శ్రీ ఇ. నరసింగరావుగా రిపుడు గుంటూరులో లేరు. జబ్బుపడి పాలకొల్లులో నున్నారు. 19 వ ఫిబ్రవరివరకు సెలవు తీసికొన్నారు. అప్పటివఱకు నేను వారియింట్లో నుండవచ్చునని చెప్పుచున్నారు. ఈమధ్యగానే నే నచటికి వెళ్లినట్టయితే, వేరొక యిల్లు మనమే కుదుర్చుకోవచ్చును. బహుశ: నాకు సెలవుదొరకక, ఉద్యోగము పోవునేమో! ఏమైననుసరే, నాఆరోగ్యమునకై నేను గుంటూరు పోవలెను. అది ఆవశ్యకము. నన్నుగుఱించి రాష్ట్రీయవైద్యాధికారితో ఉత్తర ప్రత్యుత్తరములు నడచుచున్నవి.

స. మృత్యుంజయరావు.

(3)

శ్రీరాములు

రాజమంద్రి, 1. అక్టోబరు 1896

చిరంజీవులయిన రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయువులుగాను దీవిస్తిమి. త. అంతాక్షేమం. యీ బ 5 ఆది