పుట:2015.373190.Athma-Charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. స్నేహసహవాసములు 29

బాధపడిరి. రోఁతవిసువులు వీడి నేను దల్లితోపాటు పిల్లలకుఁ బరిచర్యలు చేసితిని. వెలివెన్ను పోయి మాయమ్మమ్మను పట్టణమునకుఁ గొనివచ్చితిని. దైవానుగ్రహమున పిల్ల లందఱును కాలక్రమమున నారోగ్యస్నానము చేసి సుఖముగ నుండిరి.

మే ముండునింటికిఁ జేరువ మమ్మెఱిఁగినవారును బంధువులును నంతగ లేనందున, 1885 వ సంవత్సరమున మా పెద్దతండ్రిగారును, ఇంకఁ గొందఱు కావలసినవారును నివసించెడి రాఘవయ్యగారి కొట్లలోనికి మేము వెడలిపోయితిమి. అందువలన నొంటరిగ నుండవలసిన కష్టము మాకుఁ గొంతవఱకుఁ దొలఁగిపోయెను.

ఆ సంవత్సరముననే మా సోదరులలో నాలుగవవాఁ డగు సాంబయ్యను మా మేనమామలు తమ గ్రామమునకుఁ దీసికొని పోఁగా, అచ్చట పొంగు చూపి వాఁడు చనిపోయెను. అందఱిలోను వాఁడు మిగుల నీరసుఁడు. ముద్దుమోమున నుండెడి యాబాలకుని మరణము మమ్మందఱిని దు:ఖాబ్ధిని ముంచివైచెను. ఇదివఱకు పుత్రశోక మెఱుఁగని మాతల్లి వెఱ్ఱిదు:ఖమున వేఁగెను. ఆ మఱుసటి సంవత్సరమున మా కుటుంబమున నిం కొకమరణము తటస్థించెను. మా రెండవ పెద్దతండ్రికుమారుఁడు, నాగరాజు, నావలెనే ప్రవేశపరీక్షకుఁ జదువుచుండెను. అతని కపుడు వ్యాధి యంకురించి, కొలఁదిదినములలోనె వానియసువులను గొనిపోయెను. పాప మాతఁడు విద్యాస్వీకారమునకై గంపెడాసతో రాజమంద్రి కేతెంచి, పడరానిపాట్లు పడి, విఫల మనోరథుఁడై, తుద కకాలమృత్యువువాతఁ బడెను ! కొలఁదికాలము క్రిందటనే యాతని భార్య కాపురమునకు వచ్చియుండెను.

జ్యేష్ఠపుత్రుని మరణమున కోపక, తీర్పరాని మనోవ్యధకు లోనైన మా పెదతండ్రి కంతట రాచకురుపు వేసి, 1887 వ సంవ