పుట:2015.373190.Athma-Charitramu.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

627

ఆత్మ చరిత్రము

అనుబంధము 1. పూర్వలేఖలు

(1)

రాజమంద్రి, 18-4-1895

ప్రియసోదరా,

దయగల మీ 16 వ తేదీ యుత్తరమునకు వందనములు. నిజమె, నేనొక పక్షముదినములు జ్వరముతో బాధపడితిని. ఇపుడైనను పూర్తిగా నిమ్మళించలేదు.

ఈ సెలవులలో త్వరలో మీరును నాచెల్లెలుగారును ఇక్కడకు వచ్చెదరని వినుటకు సంతోషము. మీరు. యమ్. యే. కు చదువుచున్నట్టు మీతమ్ముడుకూడా చెప్పినాడు. ఆరోగ్యము సరిగానున్న యెడల మీరు చదువవచ్చును. మీకప్పుడు మేలే కలుగును.

చెల్లెలి అనారోగ్యమును గుఱించి తెలిసి విచారించుచున్నాను. ఆమె యిచటికి వచ్చినపుడు మందిచ్చెదను.

నాయప్పు తీర్చనందుకు విచారింపవద్దు. స్థితిగతులు బాగుపడినప్పుడు మీ రీయవచ్చును.

నాపిల్లల యారోగ్యమును గుఱించిన కుశలప్రశ్నములకు వందనములు. దైవానుగ్రహమువలన వారారోగ్యవంతులుగనే యున్నారు.