పుట:2015.373190.Athma-Charitramu.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హరిజనోద్యమము 619

తణుకు మున్నగు ప్రదేశములుపోయి, అస్పృశ్యతానివారణమును గుఱించిన సభలలో పాల్గొని వచ్చితిని.

మరల పై ప్రచారకసంఘమువారితోఁ గూడి, 6 వ ఫిబ్రవరిని మద్రాసు బయలుదేఱి, గుంటకల్లు, ఉరవకొండ, అనంతపురము, ధర్మవరము, మదనపల్లియును తిరిగితిని. పోవునపుడును వచ్చునపుడును చెన్నపురిలోని మా పిల్లవాండ్రను జూచితిని. నెల్లూరు, అల్లూరు, కావలిలోను, శ్రీ బాపినీడుగారితో సంచారముచేసి, నేను 19 వ తేదీకి గుంటూరు వచ్చితిని. మార్చి 10 వ తేదీని గుంటూరులో మా యింట జరిగిన "మండల హరిజన సేవాసమితి" మహాసభలో నూతన సంవత్సరమునకుఁ గ్రొత్తకార్య నిర్వాహకవర్గ మేర్పడెను. ఈ వేసవియందును, ముఖ్యముగ గాంధీమహాత్ముని యుపవాసకాలమందును, నేను భీమవరము ప్రాంతములందు హరిజనోద్యమ ప్రచారమును సలిపితిని.