పుట:2015.373190.Athma-Charitramu.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 618

పల్లి, విజయనగరము, శ్రీకాకుళము, ఛత్రపురము, బరంపురము, పర్లాకిమిడిపట్టణములకుఁ బోయి, అచట అస్పృశ్యతానివారణమును గుఱించి జరిగిన సభలలో పాల్గొంటిని. నేనిదివఱకు కళాశాలాధ్యాపకుఁ డనుగనుండిన పర్లాకిమిడి విజయనగరముపురములలోను, తదితర ప్రదేశములలోను ప్రాఁతస్నేహితులను, ప్రాఁత విద్యార్థులను జూచి మిగుల సంతోషించితిని.

డిసెంబరు 28 వ తేదీని గుంటూరునకు "అఖిలభారత హరిజన సేవకసమాజము" వారి కార్యదర్శియగు అమృతలాలు ధక్కరుగారు స్నేహితులతో గుంటూరువచ్చి యొకరోజు నిలిచియుండిరి. ఆ సమయమున మా తమ్ముఁడు వెంకటరామయ్యయును వచ్చెను.

అస్పృశ్యతానివారణోద్యమమును గుఱించి ప్రచారము చేయుట నా కిపుడు నిత్యవిధి యయ్యెను. జనవరి 6 వ తేదీని నేను, నా పూర్వమిత్రులగు బంకుపల్లి మల్లయ్యశాస్త్రులు గారితోఁగలసి నరసారావుపేట వెళ్లి, అక్కడ సభచేసి వచ్చితిని. 12 వ తేదీని కట్టెంపూడిలోను, చేరువనుండు తాళ్లపాలెము పంచమాశ్రమము నందును సభలు చేసితిమి. ఈ పంచమాశ్రమవాసులు శ్రీ బాపినీడు, రంగనాయకులు మున్నగు వారికిని నాకును ఫలాహారములిడిరి.

తమ్ముఁడు కృష్ణమూర్తికి జ్వరము వచ్చుచుండెనని తెలిసి, నేను 1933 సం. జనవరి 16 వ తేదీని నరసాపురము వెళ్లితిని. అతనికి క్రమముగ నెమ్మదిపడఁగా, ఆప్రాంతములకు ప్రచారమునకు వచ్చిన శ్రీయుతులు నాగేశ్వరరావు, బాపినీడు, చెరుకువాడ వెంకట నరసింహముగార్లతోఁ గలసి, నరసాపురము, భీమవరము, వేండ్ర,