పుట:2015.373190.Athma-Charitramu.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 606

అంత 7 వ ఫిబ్రవరి రాత్రికి స్పృహతప్పి, మఱునాఁడు సాయంకాలము నాలుగుగంటల కాతఁడు జీవములు కోలుపోయెను !

మరల మాకుటుంబమునకు తీఱని దు:ఖము వాటిల్లెను. పూర్వ కాలమున రాజమంద్రిలో చావుమీఁద చావువచ్చి, మాసోదరులలో కనిష్ఠుఁడును కుశాగ్రబుద్ధియునగు సూర్యనారాయణ యస్తమించెను. ఇపుడు ముప్పదిసంవత్సరములకుఁబిమ్మట మరల మా కుటుంబమున నకాలఘోరమరణ మొకటి సంభవించెను. చనిపోయిన కడగొట్టు తమ్మునిమీఁది ప్రేమమున, వానిని, గొన్ని యంశములందుఁ బోలిన తన మూఁడవ కుమారునికిని మాతమ్ముఁడు సూర్యనారాయణయనియె పేరిడెను.

బి. యల్. పరీక్షలో నిపుడె సూర్యనారాయణ జయమందెను. వీనిని బెంపుచేసికొమ్మని మాతమ్ముఁ డెన్ని సారులో సూచించినను, దురదృష్టవంతులమగు మాయింటఁబడినచొ వీని కెట్టి యనర్థము వాటిల్లునోయనుభయమున మేము ఉపేక్షించితిమి. నా భార్య పట్టుపట్టి, తనయన్న రెండవకూఁతురు మాలతి నిటీవల వీనికిఁ బెండ్లిచేయించెను. వీరివలన ముందెల్లరకు విశేషసౌఖ్యము చేకూరఁ గలదనియు, వారియభివృద్ధిఁగాంచి సంతోషింపవచ్చుననియును, మేము ఉవ్విళ్లూరుచుండువారము. కాని, పర్యవసాన మిటులయ్యెను !

కర్మాంతరము లయినపిదప భీమవరము వచ్చితిమి. అచటినుండి నేను గుంటూరు వచ్చివేసితిని. నేనిదివఱకు సిద్ధపఱిచిన "వీరేశలింగ సంస్మృతి"ని నాగేశ్వరరావుగారి ముద్రాలయమున నచ్చువేయుటకుఁ దీఱదని వారు వ్రాసిరి కావున, నే నీపుస్తకమును గుంటూరు చంద్రికా ముద్రాలయమున నచ్చొత్తించితిని. ఈ చిన్నపుస్తకమును నిపుడె