పుట:2015.373190.Athma-Charitramu.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. నూతన పరిస్థితులు 599

రాజమంద్రి బోధనాభ్యసనకళాశాల ప్రాఁత విద్యార్థుల సమావేశసమయమున నేనధ్యక్షత వహించితిని. ఆ యేప్రిలు నెలలో వియ్యమ్మగారి భూములవిషయమై మే మిదివఱకు వేసిన వ్యాజ్యెము నరసాపుర న్యాయస్థానమున మా పక్షమయ్యెను. అంతట న్యాయాధిపతి తీర్పునుబట్టి, యా వేసఁగిని రేలంగి వరిహేడుభూములు మేము స్వాధీనపఱుచుకొని, క్రొత్తకవుళ్లికిచ్చితిమి. మాచిన్న నాఁడు మాయనుభవమునుండి తొలఁగిపోయిన భూములు మరల నర్ధశతాబ్దము పిమ్మట నిపుడు మావశమయ్యెను !

29 వ సంవత్సరము వేసంగిని మేము భీమవరములో మా క్రొత్తయింట నివసించితిమి. నా భార్యయు నాచెల్లెలు నంతట గుంటూరు పోయిరి. నేను పొలములపని చూచుకొనుచు భీమవరములోనె యుంటిని. భీమవరముప్రాంతముల భూములకు తఱచుగ పాటిమట్టివేయవలసియుండుటచేత నప్పుడు చాలధనము వెచ్చించి, నేను పాటిపెరడు నొకటి యాగ్రామమునఁ గొంటిని. వేసవి తుదిని నేను మరల గుంటూరువచ్చితిని. ఇంటి మరమ్మతులు చేయించుకొనుచును, విశ్వవిద్యాలయపరీక్షా కార్యములు చేసికొనుచును, నేను కాలముగడిపితిని. తీఱికసమయముల నేను చిన్నకథలు వ్రాయుచుంటిని. మా గుంటూరు గృహమునకు ముందు చప్టానొకటి కట్టించితిని. దీనివలన మాయింటి విరివి, సౌందర్యమును హెచ్చెను. పాదులు మొలకలును బెట్టుటచేత, పెరడు దర్శనీయముగ నుండెను. ఇంటి ముందరిబాట మరమ్మతు చేయించి, దాని కిరు కెలంకులను ముండ్లతీగలు వేయించుటచేత, పశువులు ప్రవేశించుటకుఁ గొంత యాటంకము కలిగెను.

1929 వ సంవత్సరము డిశంబరు నెలలో మా పెదతండ్రి కుమారుఁడు వీరభద్రుని మూఁడవకుమారుఁడు గంగన్న పెండ్లికై