పుట:2015.373190.Athma-Charitramu.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 594

ఆ వేసంగిని మేము భీమవరమున మా తమ్ముని యింటఁ గడపితిమి. అపుడు గుంటూరులో కొన్ని మహాసభలు జరిగెను. గ్రంథాలయసభకు శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగా రధ్యక్షులు. పంచమోద్యమమును గూర్చిన మహాసభకు నే నధ్యక్షుఁడను. సభలు ముగిసిన పిదప భానుమూర్తిగారితోఁ గలసి ఏలూరుమార్గమున నేను భీమవరము వచ్చితిని.

1928 వ సంవత్సరము వేసవిని మా తమ్ముని పుత్రులలో నరసింహము సూర్యనారాయణలు బి. యె. పరీక్షలోను, సుబ్బారాయఁడు ఇంటరుమీడియెటు పరీక్షయందును గృతార్థులయిరి. మొదటి యిరువురును బి. యలు. నకును, మూఁడవవాఁడు బి. యె. పరీక్షకును జదువ నిశ్చితమగుటచేత, వారిని మద్రాసుకొనిపోయి, కళాశాలలలోఁ జేర్పింపుఁడని మాతమ్ముఁడు నన్నుఁగోరెను. మేమంతబయలుదేఱితిమి. రెయిలులో మేనల్లుఁడు జనార్దనము మమ్ముఁగలసెను. వానికిని వెలిచేటి నరసింహమునకును యల్. యం. పి. తరగతిలో నాప్రయత్నముచేఁ బ్రవేశము దొరకుటచేత, అతఁడును మాతోనే మద్రాసు బయలుదేఱెను. రెయిలులో స్నేహితు లనేకులు గానవచ్చిరి.

చెన్నపురి లాయోలాకళాశాలలో సుబ్బారాయని, న్యాయశాస్త్ర కళాశాలలో వాని సోదరులను, రాయపురము వైద్యాలయమున జనార్దనమును బ్రవేశపెట్టి, లాయోలాకళాశాల కంటియుండు భోజనవసతిగృహమున తమ్ముని కుమారులు మువ్వురకు బోజనవసతిని గలిగించి, నేను నెల్లూరు వెడలివచ్చితిని.

బంధువులగు పోడూరు వెంకయ్యగా రిపుడు నెల్లూరులో జడ్జికోర్టు శిరస్తాదారు. వారియింట నే నిపుడు బసచేసితిని. కళాశాలాధి