పుట:2015.373190.Athma-Charitramu.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. ఉద్యోగవిరామము 589

"* * ఈ చిన్న సంస్థను (కళాశాలను) బ్రోచుట కై మీరు శక్తివంచనలేకుండఁ బాటుపడితిరి. మీ వివేకదాక్షిణ్యములచే మాభక్తిప్రేమములు మీరు వడసి రని చెప్పుటలో నతిశయోక్తిలేదు. మీసునిశితబోధనము, మీ సులభసరళ ప్రసంగములు, మీ సరసవచోధోరణియు మేమెన్నఁడును మఱువఁ జాలము. * * మీ నిరాడంబర నియమబద్ధ జీవితము, విధ్యుక్తములందు మీరు కనఁబఱిచిన సద్భావసదుత్సాహములును మా కాదర్శప్రాయము లయినవి. మీ రిపు డీ కర్మకాండ విడిచి, మహాజ్ఞానులరీతిని సాంఘిక సాహిత్యవిషయములందుఁ బాల్గొనుటకును, ఈశ్వరధ్యానతత్పరు లగుటకును, విశ్రాంతిని గైకొనుచున్నారు. * * మీకుఁ జిరాయురైశ్వర్యములును, ఉత్తమోద్యమములందు విజయమును, బ్రసాదింప దేవ దేవుని సవినయముగఁ బ్రార్థించుచున్నారము."

                   సీ. "నీయుజ్జనపుటింపు నీభాషణముసొంపు
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీక్షమాతిశయంబు నీశాంతభావంబు
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీధర్మనిరతియు నీశిష్య సంప్రీతి
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీబోధమహిమంబు నీన్యాయ హితదృష్టి
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        ఎట్టివేళల కినుక యింతేనిలేక
                        మాదొసంగుల క్షమియించి మమ్ముఁ బ్రోచు
                        వరగురుని నిన్ను మేమెట్లు మఱుతుమయ్య?
                        రాయసము వెంకటశివుఁడ రమ్యయశుఁడ !