పుట:2015.373190.Athma-Charitramu.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 586

ఇట్లు క్రమముగ జరిగిననేకాని, కళాశాలలోని పని సరిగా నడువ నేరదు. దొరతనమువా రిచ్చు ధనము సంవత్సరాంతమునఁగాని రాదు. రాజాగారి పెట్టుబడి మాత్రము నెలనెలయును సరిగ వచ్చినఁగాని, ఉపాధ్యాయులకు నెలజీతములు సక్రమముగ ముట్టవు. జీతములు సరిగా లభింపని యుపాధ్యాయులచేతను సేవకులచేతను పనులు గైకొనుట సులభముగాదు. మే మెన్నిమాఱులు మొఱలిడినను, సకాలమున నుపాధ్యాయులకు జీతము లందఁజేయు విషయమై కళాశాలా పాలకవర్గమువారును, శ్రీ రాజాగారును నుపేక్షచేయుచునేవచ్చిరి.

ఇదిగాక, కళాశాలను శ్వాశ్వతసంస్థగ నిలుపఁగోరితిరేని, దానికి వలయు మూలధనము నొసంగుఁ డనియు, అందు బి. యే. తరగతులు కూడఁ జేర్పించుఁడనియును, శ్రీరాజావారికిఁ బలుమాఱు మనవిచేసితిమి. ఇవి రెండును తమకు సమ్మతమె యని శ్రీరాజాగారు పలుమాఱు సెలవిచ్చినను, ఆప్రకార మమలుమాత్ర మెప్పటికిని జరుగదయ్యెను. ఈ రెండుమార్పులును గలిగి కళాశాలకు స్థిరత్వమేర్పడెనను సుచ్వార్తవినినవెంటనే యుద్యోగవిరామము చేయ నేనిటీవల నిశ్చయించుకొంటిని. నేను సంవత్సరము లిట్లు లెక్కపెట్టుకొనుచుండినను, కళాశాల యార్థికపరిస్థితులలోమాత్రము మార్పేమియుఁ గలుగలేదు ! కళాశాలకు స్థిరత్వమేర్పడిన శుభవార్త విని యుద్యోగము మానుకొను భాగ్యము నాకిఁక లభింపనట్టు స్పష్టమయ్యెను. ఇచట వచ్చెడి జీతముమీఁదనే యాధారపడవలసిన యవశ్యత నాకిపుడు లేకుండెను. నేనిదివఱకు సంపాదించిన భూములమీఁద సంవత్సరమునకు వేయిరూపాయిలకుఁ దక్కువగాని యాదాయము వచ్చుచుండెను. నివసించుటకు గుంటూరు భీమవరముపట్టణములలో విశాలగృహములు గలవు. వయస్సుమరలి, శక్తులుడిగిపోవుచున్న మేము ధనకాంక్షచే నింకను పర