పుట:2015.373190.Athma-Charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 24

ద్రాటితో వాని నామె చిదుకఁగొట్టెను. నాఁటినుండియు మే మెవ్వరమును బొంకులకును బడిదొంగతనములకును బాల్పడువారము కాము !

మా పెదతండ్రికొడుకులు స్వయముగ ధనికుల నాశ్రయించి విద్యాసంపాదనము చేయుచుండుటకు సంతసించి, జననీజనకులు వారిజోలి కెపుడును బోకుండిరి. అందువలన నాపిల్లవాండ్రు, ఇచ్చవచ్చినపోకడలు పోయి, నాటకసమాజములఁ జేరి, తుదకు ఆయురారోగ్యములకే ముప్పు తెచ్చుకొనిరి. మమ్ముఁ జూచినపు డెల్ల లోకజ్ఞాన విషయమందు మేము వెనుకఁబడియుండుటకు వారు విచారించుచు, ఊరక మమ్ము నాటకములకుఁ గొనిపోవుదు మనియు, ఉత్సవాదులు చూపింతు మనియు జెప్పి మమ్ము శోధించుచువచ్చిరి. మేము వారివలలోఁ బడక, చీటికి మాటికిని వారు పలుకు చిన్నకల్లల కచ్చెరు వొందుచుందుము. అంత వ్యాధిగ్రస్థుఁడై ప్రవేశపరీక్ష తరగతిలోనే పెద్దవాఁడును, పిమ్మట కొంతకాలమునకు రెండవవాఁడును, అకాల మరణమువాతఁ బడిరి.

మాతల్లి మమ్ము రాత్రులు నాటకాదులకే కాక, పగలు చదువుకొనుటకు సావాసులయిండ్లకును బోనీయకుండును ! ఈకఠిన నియమము మాకును మిత్రులకును మొదట మిగులఁ గష్టముగఁ దోఁచినను, పిమ్మట నెంతో శ్రేయోదాయక మయ్యెను. స్వయంకృషిచేఁ జదువుకొనుటకు మాకు మహావకాశము లొదవెను. చదువుకొనునంత సేపును చదువుకొని, సోదరులము మాలో మేమే యాఁడుకొనుచుందుము. విద్యార్థుల కతిసూక్ష్మముగఁ బట్టుబడు బూతులు బాసలు నందువలన మాకు దూరీకృతము లయ్యెను. చదువుకొనుటకు మమ్ము రాత్రులు సహపాఠులయిండ్ల కెన్నఁడును ఆమె పోనీయదు. వారితోఁగలసి చదువుకొనుట మాకంతగ నావశ్యకమయ్యెనేని, వారినే మాయింటి