పుట:2015.373190.Athma-Charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

కన్నుల కద్భుతామోదములు గొలుపుచు, స్వర్గలోక సౌదర్యముల స్ఫురింపఁజేయుచుండెను.

1882 వ సంవత్సరమున రాజమంద్రిలో "దేశాభిమాని పాఠశాలా"ధికారి సాహాయ్యమున వారిపాఠశాలలో ప్రవేశించి, ఆఱునెలలుమాత్రమే చదివి, ఆసంవత్సరాంతమున నేను వెంకటరామయ్యయును వరుసగా 3, 1 తరగతులపరీక్షల నిచ్చితిమి. మరుసటిసంవత్సరమున దానికంటె చేరువను క్రమముగ జరుగుచుండెడి "ఇన్నీసుపేట పాఠాశాల"లో మే మిరువురమును జేరితిమి. 1883 వ సంవత్సరాంతమున "తారతమ్యపరీక్ష"లోను, మరుసటి సంవత్సరమున "మాధ్యమికపరీక్ష"లోను, నేను గృతార్థుఁడ నైతిని. నావలెనే నాతమ్ముఁడును విద్యాభివృద్ధిఁ గాంచుచుండెను.

రాజమంద్రిలో మావిద్యావిషయమై మా జననీజనకులు పూనిన శ్రద్ధనుగుఱించి యొక్కింత ప్రస్తావింపవలెను. మా చదువుసాములు క్రమముగ నెరవేరుటకై మాతండ్రి మరల సర్వే యుద్యోగములోఁ జేరి సాధారణముగఁ బరదేశమున నుండెడివాఁడు. తా నెన్ని కడగండ్లుపడి యెట్టిశోధనలకు గుఱి యయ్యును, మా విద్యాభివృద్ధికిని కుటుంబ పరిపోషణమునకును వలయుధనము నాయన సముపార్జనము చేసి మాకుఁ బంపుచుండువాఁడు. ఈసొమ్ముతో మాతల్లి యిల్లు నడుపుచు, మాచదువులు సాగించుచువచ్చెను. తండ్రి యింట లేని బాలకులు, దుస్సహవాసముల మరగి, దుష్ప్రవర్తనలకు దిగి,కాలము దుర్వినియోగము చేసెద రను గట్టినమ్మకమున నామె, పాఠశాలకును బజారు వెచ్చములకును బోవునపుడు తప్ప తక్కినకాలమందు, మమ్ము గడపదాటనీయకుండెడిది! ఇది మాస్వేచ్ఛ కమితప్రతిబంధకమై