పుట:2015.373190.Athma-Charitramu.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. నెల్లూరునివాసము: రెండవవత్సరము 557

సంస్కృతమును బ్రారంభింతు మని మేము చెప్పితిమి. వారు దీని కంగీకరించిరి.

ఆఫిబ్రవరినెల తుదికి మూఁడునెలల జీతములు మాకళాశాలలో బోధకుల కీయవలసి యుండెను. ముందుకూడ నిటులె యుండునేమో యని నేను భీతిల్లితిని.

మార్చినెల చివరరోజులలో కొందఱు స్నేహితులతోఁ గలసి నేను గుడ్లూరు పోయితిని. శర్మగారు ఎఱ్ఱాప్రెగడను గుఱించి యుపన్యాసము చేసిరి. నేనుగూడ మాటాడితిని.

హరిద్వారమునుండి వచ్చిన గోపాలదాసు బ్రహ్మచారియను సాధువు నాకొకనాఁడు నెల్లూరను గనఁబడి, నాచేత నొక కాకితములో చదరపుగడులు గీయించి, ఆగడులలోఁ నా పుట్టిన సంవత్సరము, మాసము, దినము, మున్నగునవి నేను రహస్యముగ వ్రాసి, ఆకాకితమును ముణిచి నాజేబులో నుంచుకొమ్మని చెప్పెను. అంత నా కాకితములోని సంగతులు క్రమము తప్పక యతఁడు చెప్పఁగా, పదునాఱు అంశములలోను పదునాలుగు సరిగ నుండెను ! తన రెండు పొరపాటులును ప్రమాదమునఁ గలిగినవెయని యతఁడు వాక్రుచ్చెను. దీనినిబట్టి యతఁడు పరులయూహలు సరిగ గ్రహింపఁ గలవాఁ డనుకొంటిని. భవిష్యత్తును గూర్చి యాయన చెప్పిన జోస్యములో నేమాత్రమును సత్యము లేకుండెను.

కావలి కొక జ్యౌతిష్కుఁడు వచ్చెనని తెలిసి, 2 వ యేప్రిలున శర్మగారు, నేను నచటి కేగితిమి. మఱునాఁ డాయన నింకొక గ్రామమునఁ గలసికొంటిమి. నేను కాకితముమీఁద వ్రాసికొని జేబులో నుంచుకొనిన యిరువదిప్రశ్నలును వెంటవెంటనే యాయన