పుట:2015.373190.Athma-Charitramu.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. శుభాశుభములు 539

నుంటిని. విశ్రాంతితో నుండు నా మనస్సు నిపుడు మరల విచారము ముట్టడించెను ! కార్యనిమగ్నత నుండిననే గాని, నాహృదయము దు:ఖకూపమున మునుఁగ సిద్ధమగుచుండెను ! ఇటీవల కొనినస్థలములో మేమొక కుటీర మేర్పఱుప వచ్చుననియు, కనీసము చుట్టుగోడలైనఁ బెట్టింప వచ్చుననియు, భార్య నాకు బోధించెను. నా మనస్సున కే పనియందు నిష్టము లేకుండెను !

ఈమాఱు ఆంధ్రరాష్ట్రీయసభలు కడపలో జరుగు నని తెలిసెను. మిత్రులు హనుమంతరావు వేంకటప్పయ్యగార్లు నన్నచటికిఁ గొనిపోయిరి. కడప మిగుల వెనుకఁబడియుండు ప్రదేశమువలెఁ దోఁచెను. ఉత్తరాదియాంధ్రులకును, అచటి తెలుగుఁవారికిని వేషభాషాచారము లందు మిగుల వ్యత్యాసము గానఁబడెను. జూన్ 1 వ తేదీని సభలు పూర్తికాఁగా మిత్రులతో నేనచటినుండి బయలుదేఱితిని. ఆరాత్రి మేము పండుకొనిన రైలుగదిలోని కొక యన్యుఁడు రెండవజామున వచ్చి కూర్చుండెను. పైబల్ల మీఁదఁ బండుకొనిన నేను వానిని గనిపెట్టుచునే కను లట్టే మూసితిని ! ఇంతలో పెద్దశబ్దము వినుపింపఁగా నేను లేచి చూచు సరికి, ఆ మనుష్యుఁ డదృశ్యమయ్యెను ! తోడనే మిత్రులను లేపి, వారి కీసంగతి చెప్పి, సామానులు సరిచూచుకొమ్మని హెచ్చరించితిని. పాపము హనుమంతరావుగారిపెట్టె పోయెను ! ఆయన సొమ్ము, బట్టలు, టిక్కెట్టుకూడ నందే యుండెను ! గుంటకల్లులో మే మీసంగతి పోలీసువారికి జెప్పితిమి. ఆస్తి దొరకలేదు.

ఈ సంవత్సరము గుంటూరు మండల సభలు సత్తెనపల్లిలో జరిగెను. నన్ను గ్రంథాలయసభ కధ్యక్షునిగ నెన్నుకొనిరి. సత్తెనపల్లి పరిశుభ్రమగు చిన్న పట్టణము. అచట 5, 6, 7, తేదీలలో సభలు