పుట:2015.373190.Athma-Charitramu.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. నివేశనస్థల సంపాదనము 533

కారిగఁజేసి, అందలి కార్యక్రమము సరిగజరుపుటకై ప్రత్యేకముగ నొక గుమాస్తాను, జవానును నియమింతుమని చెప్పిరి.

బ్రాడీపేటలోని స్థలము కొనుటకు నిశ్చయించితిని గాన, కొంతసొమ్ము వెంటఁదీసికొని, నేను కామేశ్వరరావుగారితో బందరు వెళ్లితిని. సుమా రరయకరము పరిమితి గల గుంటూరిలోని తమ స్థలమును చిట్టా సుందరరామయ్యగారు నాకు విక్రయించి, ముందుగ నేనూరు రూపాయిలు నాయొద్దనుండి పుచ్చుకొని, నాకు దస్తావేజు వ్రాసియిచ్చిరి. ఇది జరిగిన రెండుమూఁడు దినములకు వెంకటప్పయ్యగారు నాదగ్గఱకు వచ్చి, తమయింటి కలపకు తాము రాజమంద్రి పోవుచుంటిమని చెప్పి, కలపకొనుట కిదె తరుణము గావున నాయింటి సామానుకొనుటకై నన్ను రాజమంద్రి యాహ్వానించిరి. స్థలము కొనుట కెట్టులో నేను సమ్మతించితినికాని, యింత యవ్యవధానముగ నే నీ పురమున నిల్లుకట్ట నాకు మనసొప్పుట లేదని నేను బ్రత్యుత్తరమిచ్చితిని. అందువలనఁ బంతులుగా రొకరె రాజమంద్రిపోయి, తమ యింటికిఁ గావలసిన కలపతెచ్చుకొనిరి.

ఆ జూలై నెల తుది దినములందు గుంటూరు క్రైస్తవ మత వ్యాపనాసంఘరత్నోత్సవము జరిగెను. కళాశాలాధ్యాపకులు విద్యార్థులును గలసి యూరేగి, అతివైభవమున నుత్సవములు జరిపిరి. కాని, నామనస్సు వానియందు లేదు. పడిన చిన్న నలుసునకుఁ గనులు మెర మెరలాడునట్లు, నా చిన్నపిల్లవానిమరణసంస్మరణమున మాటిమాటికి నాహృదయము వ్యాకులత నొందుచుండెను.

మామామగారికి జబ్బుచేసెననియు, మఱఁదలు లక్ష్మమ్మకుఁ గురుపువేసెననియుఁ దెలిసి నాభార్య 29 జులయిని కట్టుంగ