పుట:2015.373190.Athma-Charitramu.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 532

17 వ తేదీని కూచిపూడిలో జరిగిన గ్రంథాలయసభకు నేనును, రాజకీయసభకు వెంకటప్పయ్యగారును అధ్యక్షులము. అనిబిసంటమ్మగారిని దొరతనమువారు నిర్బంధించిరని యీనాఁడే పత్రికలు తెలిపెను. ఆమె కీశిక్ష గలుగుటకు ప్రజలు మిగుల సంక్షోభించిరి.

ఆ నెల 26 వ తేదీని వెంకటప్పయ్యగారు నాతో మాటాడుచు, బ్రాడిపేటలోని తమస్థలమునకుఁ జేరువనె నాకొక స్థలము బేరము చేయుచుంటిమనియు, అది తప్పక నేను గొనవలెననియుఁ జెప్పిరి. కాని నాకది యిష్టములేదు. 29 వ తేదీని మిత్రులు వల్లభజ్యోస్యుల కామేశ్వరరావుగారు మమ్మిరువురను గలసికొని, ఆస్థలము తమ యల్లునిదనియు, 1200 రూపాయిలకు నాకది కుదిర్చెదమనియుఁ జెప్పిరి. నాభార్య దీనికి సమ్మతించెను. వెంటనే లోగిలి కట్టినను గట్టకున్నను, ఆస్థలము నేను బుచ్చుకొనుట యుక్తమని వెంకటప్పయ్యగారు మున్నగు మిత్రులు గట్టిగఁ జెప్పిరి. స్థలము కొనుటకు నే నంతట సమ్మతించితిని.

జూలై 3 వ తేదీ కళాశాల తెఱచు దినమైనను, అపుడె కీర్తిశేషులైన దాదాభాయి నవరోజీగారి గౌరవార్థమై యా నాఁడు సెలవీయఁబడెను. ప్రవేశపరీక్షకు ముఖ్యపరీక్షాధికారిపదవి నా కొసఁగితిమని డైరక్టరుగారినుండి నాకు లేఖవచ్చెను. నామనస్సునకీ క్రొత్తవిషయము కొంత వ్యాపృతిఁ గలిగించెను. నే నిపుడీయ వలసిన ప్రశ్నపత్రమును గుఱించియు, దీనికి సంబంధించిన యితర విషయములను గుఱించియు నాలోచనలతో నామనస్సు దు:ఖము బారినుండి కొంత తప్పించుకొనెను.

ఇపుడు నాకుఁగలిగిన క్రొత్తపని యిది యొకటియె కాదు. కళాశాలాధ్యక్షులు, పుస్తక భాండాగారమునకు నన్ను ముఖ్యాది