పుట:2015.373190.Athma-Charitramu.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. దు:ఖోపశమన ప్రయత్నములు (1) 523

లగు సుబ్బరాయభట్టుగారు. ఆయన కీ యుద్యోగ మగునని నేనును , నాకె యగునని యాయనయును అనుకొంటిమి. కాని మా యిద్దఱకునుగాక, మా యుభయులకంటెను వేతనానుభవములందు వెనుకఁబడి యుండు నొక తమిళబోధకుని కీ యుద్యోగ మొసఁగఁబడెను.

చెన్నపురిలోనుండు రెండుదినములలోను నేను రెండుపనులు పెట్టుకొంటిని. నా పూర్వవిద్యార్థియగు నొక పెద్దమనుష్యుఁడు పిల్లలతల్లి యగు తన సతిని విసర్జించి యొంటరిగ మద్రాసున నుద్యోగము చేయుచుండెను. నా పూర్వశిష్యులయిన యా సుదతి సోదరుల కోరిక ననుసరించి నే నిపుడు నాయనుంగుశిష్యునితో సంధిమాటలు జరిపితిని. ఈవిషయమునఁ దప్పంతయు తన సతిదె యని యాతఁడు చెప్పి, సామమార్గమున కంగీకరింపక, భావోద్రేకమున నామ్రోల విలపించెను. నేనాతనిని వదలివేసి, రెండవసంగతి చూచుకొనుటకుఁ బోయితిని. రెండవ మిత్రుఁడును నా పూర్వశిష్యవర్గములోనివాఁడె. కోపమున భర్తను వీడిన యొకవిదుషీమణికి, భార్యను వీడిన యీ విద్యాధికుఁ డాతిథ్య మిచ్చుచుండెను. ఇది పాడిగాదని వారలకు నేను హితముచెప్పి, యాకారణమున నాయువతీయువకుల దూషణోక్తులకు గుఱియై, మోమున ముసుఁగువైచికొని, యింటికి వెడలివచ్చితిని !

ఇంతలో లాహూరు ఉద్యోగమును గుఱించి నాకు జాబులు వచ్చియుండెను. ఆయుద్యోగమును గుఱించి వచ్చిన దరఖాస్తులు విమర్శించుట కొక యుపసంఘమును కళాశాలాపాలకు లేర్పఱిచి రనియు, ఆ చిన్న సంఘమువారు అందఱిలోను నన్నును, కలకత్తా విశ్వవిద్యాలయములో మొదటితరగతిని మొదటివాఁడుగ జయమందిన యొక యువకుని నెన్నిరనియును తెలిసెను. కావున మా కిరువురికి