పుట:2015.373190.Athma-Charitramu.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 522

ఆనెల 15 వ తేదీని గుంటూరు వచ్చిన బ్రాహ్మమత ప్రచారకుఁడు హేమచంద్రసర్కారుగారు కొన్నిదినము లచట నుండిరి. వారొకనాఁడు నాతో సంభాషించుచు, ఆస్తికమతసంస్థ యగు దయాళసింగు కళాశాలలోని యుద్యోగము నేను గైకొందునా యని యడిగి, నాసమ్మతిమీఁద పంజాబులోని తమ మిత్రులకు నన్నుఁ గూర్చి వ్రాసిరి. సర్కారుగారు మున్నగు మిత్రుల సాహాయ్యమున నా కిపుడు లాహూరు ప్రాంతములందుఁ గొందఱు పరిచితులయిరి.

ఇపుడు సేలము లాహూరు కళాశాలలందలి యుద్యోగప్రయత్నముల యలజడిలో నాదు:ఖము కొంత మఱుఁగుపడెను. 15 వ అక్టోబరున సేలము పురపాలకాధ్యక్షునియొద్దనుండి నాకొక లేఖ వచ్చెను. నన్నును, మఱికొందఱు దరఖాస్తుదార్లను, చెన్నపురి రాజధానీ కళాశాలలో సమావేశమగు కొందఱు పెద్దమునుష్యులయొద్దకు రమ్మని వారు కోరిరి. ఇంతలో నేను పంజాబునందలి యుద్యోగమును 250 రూపాయిల జీతముమీఁద స్వీకరింతునాయని యా కళాశాల కార్యదర్శి నన్నడిగెను. ఆజీతము నాకు సరిపడలేదు. లాహూరు మిత్రు లొకరు నాకు జాబు వ్రాసి, వెంకటరత్నమునాయఁడుగారు నన్ను లాహూరుపదవికి సిఫారసు చేసినచో, నాకు లాభము కలుగునని చెప్పిరి. ఆ నవంబరు 17-18 తేదీలలో బందరులో జరిగిన బ్రాహ్మ సమ్మేళనమునకు గుంటూరు మిత్రులతో నేను బోయి, నాయఁడుగారిని జూచి మాటాడితిని. ఆయన నన్ను గుఱించి సిఫారసు చేసిరి.

23 వ తేదీని నేను చెన్నపురి కేగితిని. సేలము కళాశాలోద్యోగమునకై ప్రయత్నించెడి మఱియిద్ద ఱభ్యర్థులు నా కగఁబడిరి. వారిలో నొకరు విజయనగరకళాశాలలో నాతోడిసహాయాధ్యాపకు