పుట:2015.373190.Athma-Charitramu.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. 'అబ్బావు' మరణము 517

చెవులకు సదా వినవచ్చుచునే యుండెను. నాయాత్మ కంధత్వము గ్రమ్మెను ! ఐహికాముష్మికము లిఁక సారాహీనులుగఁ దోఁచెను ! నిస్సారముగను, అతి దుర్భరముగను నుండిన యీ హేయఁపు బ్రదుకు నంతమొందింప నే విషద్రావకమైనఁ ద్రావ నేను గాంక్షించుచుంటిని ! కాని, పాపపు ప్రాణమును మఱింత పాపమార్గమునఁ బాపుకొనుటకు నామన సొప్పకుండెను.

నాకోరికమీఁద నాశిష్యుఁడగు చామర్తి రాజశేఖరము, నా మనస్సంతృప్తికొఱ నీ క్రింది పద్యముల నాదినములలో నాకు రచియించి యిచ్చెను. ఇది నెపముగా నాపాపము వానికిని సోఁకెనా యనునట్టుగ నీ యువకుఁడు, ఇరువదిసంవత్సరముల లేఁబ్రాయముననె తానును మృత్యువు నోటఁబడిపోయెను -

                    ఉ. అల్లన నమ్మయంచు మఱి
                                యన్న యటంచును మమ్ముఁ బిల్చి యు
                        ద్యల్ల లితంబుగాఁ బలువి
                                ధంబుల క్రీడలు సల్పుచున్న మా
                        యుల్ల ము పల్లవించు జిగి
                                యొప్పెడి నీయెలనవ్వు లెల్ల జా
                        బిల్లి వెలుంగు వెల్లికల
                                వెల్లువల న్మఱపించుచుండెడిన్.

                   చ. జననమునాది నీబ్రదుకు
                                సంశయమయ్యె ననుక్షణంబు నీ
                       జనని కపాయ మొండొదవఁ
                                జాలదుగా యని నమ్మియుండు మా